ఒక ఊరిలో, కోకిల వంటి చిత్రాల్లో నటించి ఫేడ్ అవుట్ అయిన కధానాయిక సలోనిని మర్యాదరామన్న చిత్రంతో వెలుగులోకి తెచ్చారు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ చిత్రం తర్వాత సలోని కెరీర్ కు డోకా ఉండదని అనుకున్నారు అందరూ. కానీ ఈ తారను మర్యాదరామన్న తర్వాత కూడా పెద్ద క్రేజీ ఆఫర్లెమీ వరించలేదు. ఇక సహనం నటించిన ఈ ముద్దుగుమ్మ కొత్త హీరోలతో రూపొందుతున్న తెలుగమ్మాయి చిత్రంలో నటిస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది లేడి ఓరియంటెడ్ సినిమాగానే చెప్పాలి. అయితే తెలుగమ్మాయి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పంజాబీ కధానాయిక సలోనిని ఎంపిక చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో వానపల్లి బాబురావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కధ గురించి దర్శకుడు చెబుతూ నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి సికింద్రాబాద్ నుంచి గోదావరి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి సామర్లకోట వరకు వెళతారు. ఈ రైలులోనే సినిమా సగభాగం వుంటుంది. ఆ రైలులో జరిగే సంఘటనలు వినూత్నంగా ఉంటాయి. పూర్తి వినోదాత్మకంగా, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. తెలుగమ్మాయి ఎలా ఉండాలో తెలియచెప్పే చిత్రమిది అని దర్శకుడు రాజావన్నెం రెడ్డి చెప్పుకొచ్చారు.