యువరత్న బాలకృష్ణ, లెజండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కాంభినేషన్ లో రూపొందుతున్న ‘పరమవీర చక్ర’ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ భామ నేహా ధూపియా, అమీషా పటేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ ‘పరమవీర చక్ర’ అని పెట్టారు కదా అని బాలకృష్ణ నుంచి సీరియస్ మాస్ మసాలా సినిమా అన్న సంగతి అర్థమవుతోంది. అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రంలో దాసరి పవర్ ఫుల్ సీన్స్, పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయట. కాగా ఈ చిత్రంలో నేహా బికినీ లో కనిపించి కనువిందు చేయనుంది. సినిమాలోని ఒక సన్నివేశంలో బాలకృష్ణను రెచ్చ గొట్టడానికి పాడే పాటలో బికినీ వేసుకున్నట్టు సమాచారం. హాట్ హాట్ డ్రెస్ లలో ఈమె చేసిన డ్యాన్స్ యువతను బాగా ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బాలకృష్ణతో షీలా కూడా రొమాన్స్ చేయనున్నది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.అందరికి హితవులు పలికె దాసరి కూడ ంగిలిన డైరక్టర్స్ మాదిరిగానే హిరోయిన్ తో ఎక్స్ పోజింగ్ చేయిస్తే అతని టెలెంట్ ఏముంది బాలకృష్ణ లాంటి క్రేజ్ గల హిరోని పెట్టుకొని కధ తో నడిపించాలి కాని హిరోయిన్ ల అందాలు చందాలు బికినీ లు ఇవన్ని పెట్టినంత మాత్రన సినిమా హిట్ అవుతుంది అనుకోవటం దాసరి పిచ్చితనం ఎమైతెనేం బాలకృష్ణ మంచి ఉపు మీదున్నప్పుడే ఈ చిత్రం రావటంతో కలెక్ష్న్స్ కి దొకౌండదు [అయిన ఇప్పుడె ఎందుకు అవన్ని]
కృష్ణ, కిక్, డాన్ శీను వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత క్రేజీస్టార్ రవితేజ హీరోగా యువదర్శకుడు హరీశ్ శంకర్ ఎస్. కథ - మాటలు - దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై నవనిర్మాత రమేష్ పుప్పాల నిర్మిస్తున్న భారీ చిత్రం "మిరపకాయ్" షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ.. రవితేజగారితో మా సంస్థ నిర్మించిన మొట్టమొదటి చిత్రం మిరపకాయ్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్, రాజమండ్రి, స్విట్జర్లాండ్, బ్యాంకాక్‌లలో చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం.
రవితేజ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్, హరీష్ శంకర్ టేకింగ్, థమన్ మ్యూజిక్, రాంప్రసాద్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్స్ అవుతాయి. మిరపకాయ్ టైటిల్ కి తగినట్లుగానే రవితేజ క్యారెక్టర్ ఉంటుంది. పాటలన్నీ సూపర్ హిట్టవుతాయి అని చెప్పారు.
ఈ చిత్రంలో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, ఆలీ, నాగబాబు, రాజా రవీందర్, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, సుధ, సురేఖవాణి నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సి. రాంప్రసాద్, అసోసియేట్ డైరెక్టర్స్: నాగేంద్ర వుద్దీశ, సత్యనారాయణ బండి గుప్తాపు, విజయ్ కనకమేడల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీందర్, నిర్మాత: రమేష్ పుష్పాల, కథ - మాటలు- దర్శకత్వం: హరీశ్ శంకర్ ఎస్
నిజజీవితాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునే రాంగోపాల్ వర్మ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుక వచ్చినట్లు భోగట్టా. అదేమిటంటే... వైఎస్ జగన్ జీవితంపై సినిమా తీయాలనుకోవడం.వైఎస్సార్ మరణానికి ముందు, ఆ తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఎలా సాగిందన్న దానిపై వర్మ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే "వైఎస్ జగన్ రాజకీయం" అనే పేరుతో వర్మ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు భోగట్టా.ఇకపోతే ఇప్పటికే ప్రకటించిన బెజవాడ రౌడీలు చిత్రం స్క్రిప్టుపై వర్మ ప్రత్యేక దృష్టిలో పెట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నటిస్తారని సమాచారం.
డ్రగ్ మాఫియా ఆ తర్వాత వ్యభిచార కేసుల్లో హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సైరాభాను తాను పెద్దగా ఫీల్ కావడం లేదని చెపుతోంది. ఇటీవలే ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఆమె సెంటర్ ఫర్ ది ఎట్రాక్షన్ అయింది. తనకు మీడియా వాళ్లు పబ్లిసిటీ ఇచ్చి మంచి పనిచేశారని ఆనందంగా చెపుతోంది.
ఎందుకని అడిగితే... "బి" గ్రేడ్ సినిమా నిర్మాతలు చాలామంది సంప్రదించి తనను నటించమని కోరుతున్నారట. మొన్నటివరకూ సినిమాలకు లక్ష తీసుకునే ఆమె ప్రస్తుతం పది లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. దీనికి సిద్ధపడి ఓ నిర్మాత డేట్స్ కూడా తీసుకున్నాడట. కాకపోతే అందులో అతనే కథానాయకుడు.
హీరోయిన్‌తోపాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తుందట. మైనస్ ఏమిటంటే ఈ గొడవకు ముందు ఆమె వివాహానికి సిద్ధమైంది. దీంతో అది కాస్తా కొండెక్కింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవాతో అందాల ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య ఓవర్‌టైమ్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్. వీరిద్దరూ సెట్స్‌లో ఓవర్‌టైమ్ చేయడంతో పాటు రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారని పుకార్లు షికార్లు చేయడంతో, రమలతలా నయనతారకు కూడా కోపమొచ్చిందట.
కానీ రమలత, నయనతారల గురించి ముందే తెలుసుకున్న హన్సిక మాత్రం ప్రభుదేవా తనకు సోదరుడని ట్విట్టర్ రాసుకుందట. రమలత, నయనతారల మధ్య సవతి పోరు సాగుతున్న ఈ నేపథ్యంలో.. మనకీ గొడవెందుకు అని భావించిన హన్సిక.. ప్రభుదేవాతో తనకు సంబంధముందనే వార్తలను ఖండించింది.
ప్రభుదేవాకు "నేను చెల్లెల్ని మాత్రమే"నని ట్విట్టర్‌లో చెప్పింది. 'ప్రభుదేవా సర్'తో తనకు ఏదో సంబంధముందని వస్తున్న వార్తలు వదంతులు మాత్రమేనని, అవన్నీ అసత్యాలని హన్సిక కొట్టిపారేసింది. అంతేకాదు.. ప్రభుదేవా "నాకు అన్నయ్య" అని హన్సిక తేల్చి చెప్పేసింది.
మాజీ మిస్ చెన్నై త్రిషకు ఉన్నట్లుండి మాతృభాషపై ప్రేమాభిమానాలు పొంగుకొచ్చినయ్. ఇటీవల ఆమె పాల్గొన్న సభలో చాలామంది ఇంగ్లీషులో మాట్లాడుకోవడాన్ని చూసి, ఒక్కసారిగా మైకు అందుకని, దయచేసి అందరూ తమిళ భాషలో మాత్రమే మాట్లాడుకోవలసిందిగా(దైవసైది... ఎల్లారూ తమిళ్ పేసుంగ) విజ్ఞప్తి అంటూ తమిళంలోనే మాట్లాడిందట. అంతేకాకుండా ఇంగ్లీషు భాషలో మాట్లాడే సంస్కృతి తమిళనాట పెరగడంపై లెక్చరిచ్చిందట. ఇవాళ రేపు అందరూ నాలుగు ముక్కలు ఇంగ్లీషు తెలియగానే లొడలొడమంటూ ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తమిళనాడును ఆంగ్లనాడుగా మార్చేస్తున్నారని మండిపడిందట.
తమిళ భాషపై మమకారంతో మన పెద్దలు మనకంటే ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, ఆ ప్రావీణ్యాన్ని అవసరమైన చోట ప్రదర్శిస్తారే తప్ప తమిళనాడులో కాదని త్రిష గుర్తు చేసిందట.భాషాభిమానం ఇంతగా పొంగిపొర్లతున్న త్రిషకు ముఖ్యమంత్రి కరుణానిధి తమిళభాషాభివృద్ధికి సంబంధించి ఏదైనా పదవి ఇస్తే బావుండు అని అక్కడివారు గొణుక్కున్నారట.
చిన్నప్పుడు చందమామ కధలో చదువుకొన్నాట్టు...చిట్టీ ఎలుక ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతుంది సిమ్హం-ఎలుక కలిసి దోస్తీ చేస్తాయి.చిరుతపులి జింక తో కులాసా కబుర్లు చెప్పుకొంటుంది. నార్నియా సినిమాలు కూడా అంతే. వెండి తెర మీద జంతువుల విన్యాసాలకు అద్దం పడతాయి. మైకేల్ ఆప్టెడ్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం 'ది క్రానికల్ ఆఫ్ నార్నియా - ద వాయెజ్ ఆఫ్ డాన్ ట్రేడర్ '. ద ట్వంటీయత్ ఫాక్స్ స్టార్ సంస్థ ఇంగ్లీషు, హిందీ ,తెలుగు భాషల్లో డిసెంబర్ 3న విడుదల చేస్తోంది తెలుగు లో "నార్నియా అద్బుతయాత్ర "పేరుతో వస్తోంది.ఆ సంస్థ ప్రతినిధి ' విజయ్ సింగ్ ' మాట్లడుతూ: " గతంలో వచ్చిన నార్నియా చిత్రాలకు భారతదేశంలో ఆదరణ లభించింది అందుకే హాలీవుడ్ కంటే ముందు ఇక్కడ విడుదలచేస్తున్నాం త్రీడిలో నార్నియా విన్యాసాలు అబ్బురపరుస్తాయ న్నారు...!
ఒకప్పుడు మలయాళంలో మమ్ముట్టి చిత్రం షకీలా చిత్రం విడుదలైతే షకీలాకు అద్భుత రెస్పాన్స్ వచ్చేది. తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా మల్లికా శరావత్ మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి.
కానీ ఆమె హిస్‌స్ అని బుసకొట్టినా అదే టైంలో రిలీజై రక్తచరిత్రతోపాటు మరో రెండు తెలుగు సినిమాల ముందు ఆడలేదు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన చదలవాడ శ్రీనివాసరావు చేతులు కాల్చుకున్నాడు.
రోబో వంటి చిత్రాన్ని విడుదల చేయాల్సింది మిస్సై ఇలా శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి
ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు రవితేజ. ఏదైనా తేడా వస్తే మాత్రం మంటెత్తి పోతాడు. అందుకే మిరపకాయ్ అన్నది. మిరపకాయ్ కొరికితే నోట్లోంచి సెగలు పుట్టించేస్తుంది. ఈ కుర్రాడి అసలు కథేంటో తెరపైనే చూడాలి. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. కావల్సినంత వినోదం ఉంటుంది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అంటున్నారు 'మిరపకాయ్' చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల.రవితేజ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుష్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం ఆడియో డిసెంబర్ 5న, సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేమ్ దీక్ష హీరోయిన్స్ గా చేసారు. మిగతా పాత్రల్లో ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, ఆలీ, నాగబాబు, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, సుధ, సురేఖావాణి కనిపిస్తారు. పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, సాహితి, సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: రాంప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: దేవినేని బ్రహ్మానందరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీంద్ర, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్. ఇక రీసెంట్ (నవంబర్ 24) గా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో 'వీర' చిత్రం షూటింగ్ మొదలైంది. కాజల్, తాప్సీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు.
తెలుగులో ఆర్యన్ రాజేష్ సరసన నటించించి నికిత ఆ తర్వాత రెండుమూడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఆమె కన్నడలో బిజీగా నటిస్తోంది. పెండ్లి గురించి అడిగితే టైమ్ రావాలనేది. అది వచ్చినట్లుంది.హీరో దర్శన్‌తో కాపురం చేస్తుందన్న వార్తలు గుప్పుమన్నాయి. రహస్యంగా పెండ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల ఊటీలో దర్శనమిచ్చారట. నికిత గుర్తుపట్టలేని విధంగా మోడ్రన్‌గా తయారైంది. దర్శన్‌కు ఆల్రెడీ కొడుకు ఉన్నాడు.తను ముంబయిలో ఉంటున్నట్లు అక్కడ గెస్ట్‌హౌస్‌లో చెప్పిందట. దర్శన్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చాడని సమాచారం. ఒక ఏజ్ వచ్చాక తోడును కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇండస్ట్రీలో అందగత్తెలంతా సెకండ్స్‌గా ఎందుకెళతారో అర్థంకాని ప్రశ్న.
"ఆరెంజ్" రిలీజ్‌కు ముందే కోటిన్నర ప్రాఫిట్ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత మన్యం రమేష్ నిర్మాత అయిన తన బావ నాగబాబుతో చెప్పాడట. సరేలే ఏదోవిధంగా లాభపడ్డామని అనుకున్నాడట. అయితే విడుదలైన తర్వాత ఆరున్నరకోట్ల డెఫిషియట్ చూపించాడట. రెండోరోజుకు 18కోట్లకు చేరింది. దీంతో షాక్‌కు గురైన నాగబాబు మన్యం రమేష్‌ను చెడామడా తిట్టేశాడట. దీంతో మనస్థాపం చెందిన రమేష్ ఇంటికి వెళ్లకుండా రోజంతా ఎక్కడో ఉండిపోయాడు. బావ మొహంలో ఆనందం చూడాలనుకున్నాను. ఇంత కోపం చూడలేక నేను వెళ్లిపోయానని తన ఇంటికి ఫోన్ చేశాడట. ఈ విషయం నాగబాబుకు తెలిసి వేట మొదలెట్టారు. ఫోన్ కాల్ ఏ ఏరియా నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేయగా, గచ్చిబౌలి నుంచి అని తెలిసింది. అక్కడికి వెళ్లి ఓ రూమ్‌లో ఉన్న రమేష్‌ను నాగబాబు మంచిగా పలుకరించి.. డబ్బు పోతే పోయింది. నువ్వుపోతే ఎక్కడి నుంచి తేను... అని కాస్త కుదుటపడేలా మాట్లాడారట. ఆ తర్వాత కారులో వచ్చేటప్పుడు నానా బూతులు తిట్టి వెధవా.. ఎందుకు బతకడం అని తిట్ల వర్షం కురిపించారట.
దీంతో నాగబాబు సోదరి క్షమించమని వేడుకొనగా నీ మొహం చూసి వదిలేశానని చెప్పాడట. ఇక ఆ తర్వాత ఎకౌంట్స్ పరిశీలిస్తే... ఆరున్నర కోట్లు రమేష్ వెనకేసినట్లు తేలిందట. ఆ డబ్బుతో రెండు చిన్నపాటి చిత్రాలు తీయాలనే ప్లాన్‌లో ఉన్నాడని ఆయనకు సమాచారం అందింది. దీంతో మింగలేక... కక్కలేక.. ఇక నుంచి వాడి మొహం చూడనని నాగబాబు చెప్పాడట.
ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి నిర్మాతలు వచ్చేది డబ్బుతో ఎంజాయ్ చేయడానికేనని పలు సంఘటనలు ఒక్కోసారి రుజువు చేస్తుంటాయి. ఓ నిర్మాత ఆదివారంనాడు షూటింగ్ చేపట్టాడు. దర్శకుడు, నిర్మాత రెండూ ఆయనే అవ్వడంతో హీరోయిన్ బికినీ షాట్ సీన్‌కు ఆయన తన ఫ్రెండ్స్‌ను తీసుకవచ్చాడు.బికినీలో ఉన్న ఆమె అందాలను వారు బాగా ఆస్వాదించారు. మూడు టేకులు వరకు చేయించారు. చాలా సిగ్గుతో చేసిన ఆమె ఆ తర్వాత మేకప్‌మేన్ అసలు సంగతి ఆమెకు ఉప్పదించడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే తను ఇక చేయనని చెప్పేసింది. ఆ తర్వాత తను రేపటి నుంచి రావడంలేదని వేరే షూటింగ్‌కు కమిట్ అయ్యానని తప్పుకుంది. అది సినిమా కాబట్టి నిర్మాత ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రి ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. మరి ఆ తర్వాత ఏమైందోకానీ... తను ఊరు వెళ్లిపోతున్నట్లు చెప్పిందట. కొత్త అమ్మాయిలూ... వేషంకోసం వస్తే తస్మాత్ జాగ్రత్త.
ఇటీవల హీరోయిన్లు సినిమాల్లో ఎంతటి ఎక్స్‌పోజింగ్ చేసినా అది కథ మేరకే అంటూ నీతులు వల్లించడం పరిపాటి అయిపోయింది. కానీ బయట ఫంక్షన్స్‌కు వచ్చేటపుడు రకరకాల గెటప్స్‌తో వస్తుంటారు. ఇదంతా తమను తాము పబ్లిసిటీ చేసుకునేందుకేనన్నది జగమెరిగిన సత్యం.ఇటీవల కల్పనా చౌదరి కూడా ఇలాగే వచ్చింది. పలు చిత్రాల్లో చిన్నాచితక పాత్రలు వేసిన ఈ భామ రామానాయుడు చిత్రం ఆలస్యం అమృతం చిత్రంలో నటించింది. స్టేజిపై హీరోయిన్ కంటే ఆమె ఎట్రాక్షనే ఎక్కువైంది. మోకాళ్ల పైవరకూ కన్పించే డ్రెస్‌తో వచ్చి స్టేజిపై కాలుపై కాలు వేసుకుని కూచుంది. దీంతో ఫోటోగ్రాఫర్లకు బాగా పని దొరికింది. ఎడాపెడా అనేక కోణాల్లో ఫోటోలు లాగించేయడం మొదలెట్టారు.ఇది గమనించిన మరో నటి శివపార్వతి.. ఇటీవల యానాగుప్తా ఓ ఫంక్షన్‌కు డ్రాయర్ వేసుకోవడం మరిచిపోయి వచ్చిందట.. నువ్వు కూడా అలా వచ్చావా ఏంటి..? అని గుసగుస అడిగిందట. దానికి చౌదరి సమాధానమిస్తూ... నేను డ్రాయర్ వేసుకునే ఉన్నాను. ఏం ఫర్వాలేదు.. తీస్కోనీయ్ అని నవ్వుతూ చెప్పిందట.దీంతో ఆ పక్కనే ఉన్న నాయుడుగారు కలుగజేసుకుని.. ఏంటీ.. జోకులేసుకుంటున్నారని అడిగితే... కల్పనా చౌదరి బదులిస్తూ... హీరోయిన్‌గా పనికొస్తావ్.. నెక్ట్స్ సినిమాలో నాయుడుగారిని ఛాన్స్ అడగమంటుందో శివపార్వతి అక్క అని అనడంతో, అయితే నన్ను హీరోగా చేయమంటోందా...? అంటూ తెలివిగా సమాధానమిచ్చారట నాయుడుగారు
యానా గుప్తా ఏదైనా ఫంక్షన్‌కి వస్తుందంటే నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఆమె అండర్‌వేర్ ధరించి వస్తుందో లేదోనన్న అనుమానం వారిని పట్టి పీడిస్తోందట.అదలా వుంచితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన యానా ప్యాంటీ వేసుకు రావడం మరిచిపోయింది. అలా ఆమె ఓ కుర్చీలో ఆశీనురాలు కాగానే కెమేరాలు ఆ దృశ్యాలను బంధించి వేశాయి. విషయం తెలుసుకున్న యానా తొలుత కాస్త తప్పించుకోవడానికి చూసినా ఆ తర్వాత వదిలేసింది.ప్యాంటీ ఎందుకు వేసుకు రాలేదని ఆమెను కదిలిస్తే దిమ్మతిరిగే సమాధానం చెప్పిందట. తనకు ప్యాంటీలంటే చెడ్డ చిరాకనీ, అందుకే వాటిని ధరించడానికి ఇష్టపడనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందట. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుందనీ, తనకు ప్యాంటీ ధరించకుండా తిరిగే అలవాటు వుందని చెప్పిందట యానా. ఇప్పటికైనా ఆయా కంపెనీలు ఆమెను ఫంక్షన్లకు, పార్టీలకు పిలవడం మానుకుంటారో లేదో చూడాలి.
ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ అల్లరి నరేష్ మాలాంటి వాళ్ళందరికీ స్పూర్తిగా నిలిచాడు' అని నరేష్ గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అల్లరి నరేష్,కామ్నా జట్మలానీ కాంబినేషన్ లో ఈవీవీ రూపొందించిన 'కత్తి కాంతారావు' ఆడియో పంక్షన్ కి హాజరై ఈ విధంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ ఆడియో సీడీలను ఆవిష్కరించి పై విధంగా స్పందించారు. అలాగే.. 'సాధారణంగా హీరోలుగా నిర్మాతల కొడుకులే స్దిరపడతారని అనుకుంటారు. కానీ దర్శకుల వారసులు కూడా హీరోలుగా నిలదోక్కుకోగలరని 'అల్లరి' నరేష్ నిరూపించాడు అన్నారు. మల్లికార్జున్ సంగీతం సమకూర్చిన ఈచిత్రం పాటలు ఎస్.వీ.వీ.మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.