Free SMS And Earn Part Time Money







2/19/11

గగనం + _


డివోషనల్ గా తీయాలన్నా,రొమాంటిక్ గా తియ్యాలన్నా,వెరైటీగా తీయలన్నా ఉన్న ఓకే ఓక హీరో టాలీవుడ్ కి మన నాగార్జున గారు. మరి గగనం విషయానికి వస్తే ఓ ప్యాన్ గా ఎలాంటి మూవి తీసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక మూవీ ఒక ఒక్క దమ్ము లేదు అని ఫీల్ అవ్వాలో తెలియడం లేదు. నా విశ్లేషణ చూసి మీరు నిర్ణయించండి.. ప్లస్ ల విషయానికి వస్తే... మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది మరియు స్క్రీన్ ప్లే కూడా బావుంది. మైనస్ ... 1. రాజమౌళి సినిమాల లో ఒక చిన్న రౌడీని కూడా చాలా వైలెంట్ గా చూపిస్తారు. అలాంటిది ఈ సినిమాలో కనపించే హైజాకర్స్ ని చాలా సింపుల్ చూపిస్తారు. నిజానకి హైజాకర్స్ చాలా క్రూయల్ గా ఉంటారు..కదా 2.విలనిజమ్ కూడా హీరోకి ఈక్వెల్ గా ఉంటేనే కదా పండుతుంది. అలాంటిది ఈ సినిమాలో నాగార్జున కి ఈక్వెల్ గా హైజాక్ర్స్ ని ఎలివేట్ చెయ్యలేదు. 3. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోర్ కొడుతుంది. 4. తాముండే ప్లైట్ హైజాక్ అయ్యిందని తెలిసిన వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు.. అలాంటిది ఈ సినిమాలో ప్లైట్ లో ఉండే ప్యాసింజర్ లో హైజాకర్స్ ధ్రెట్ అనేది ఎక్కువ కనపడదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూంటారు. 5.అందులో ఒక పెయిర్ అయితే (డాక్టర్) తాము హైజాక్ అయిన విషయాన్నే పట్టనట్లు హ్యాపీగా లవ్ చేసుకొంటూ ఉంటారు. 6. కథలో కీలక మలుపు అయిన హైజాకర్స్ ని బ్లప్ చెయ్యకుండా వేరే కాన్సెప్ట్ ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండను..అది రియల్ లైప్ సినేరియో కి చాలా దగ్గరగా ఉండేది..ఎందుకంటే హైజాకర్స్ అంతా సినిమాలో చూపించినంత వీక్ మైండెడ్ ఉండరు కూడా. 7. క్లైమాక్స్ బాంబ్ సీన్స్ ఏదో నాగార్జున హీరోయిజమ్ చూపించటానకి పెట్టారు అనిపిస్తుంది ఇలాంటి రొటీన్ సీన్స్ ఎన్నో తెలుగు మూవీస్ లలో ఇప్పటికే చూసేసాము.
Powered by web analytics software.