నెట్లో హీటెత్తించే ఫోటోలు ఎవరివై ఉంటాయి... అంటే ఖచ్చితంగా హాలీవుడ్ తారల పేర్లే బయటకు వినిపిస్తాయి. గుండెల్లో వేడి సెగలు పుట్టించే ఆ తారలకోసం నెటిజన్లు అదేపనిగా శోధిస్తూనే ఉంటారట. ప్రత్యేకించి కొంతమంది అడల్ట్ తారలంటే నెటిజన్లకు అమితమైన అభిమానం ఉన్నదట. ఆ అభిమానమే ఈ అడల్ట్ తారలకు మిలిన్ల వర్షం కురిపిస్తోందట. ఇంతకీ ఆ తారలెవరో చూద్దామా...
సుమారు ఎనభైకి పైగా "పెద్దలకు మాత్రమే" టైపు చిత్రాల్లో నటించిన మేరీ కేరీ అందమైన అడల్ట్ నటీమణుల జాబితాలో ముందుకు దూసుకువచ్చి అగ్రస్థానంలో నిలుచుందట. ఆ తర్వాత ఇరవై అడల్ట్ చిత్రాల్లో తన హాట్ హాట్ అందాలను కనువిందు చేసిన జెన్నా జేమ్సన్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి మేరీ కేరీ అందాలతో తన అందాలను పోటీగా చూపుతోందట. పోర్నోగ్రాఫిక్ స్టార్‌గా ప్రసిద్ధిగాంచిన స్టార్మీ డేనియల్స్ చిత్రాలకోసం కుర్రకారు నెట్లో ఎగబడుతూ ఉంటారట. దీంతో ఆమె క్లబ్ డ్యాన్సులను ప్రదర్సించడానికి మిలియన్లకొద్దీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ హాలీవుడ్ క్లబ్ యాజమాన్యాలకు దడ పుట్టిస్తోందట. ఆకర్షించే ఎద సంపద, కిక్కెక్కించే నడుము ఒంపులు, కైపెక్కించే మత్తైన కళ్లు... వీటన్నిటినీ మించి అమృత ధారలు కురుపించే పెదవులున్న స్పీడ్ నటికి సంబంధించిన మత్తైన చిత్రాలను నెటిజన్లు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారట. దాంతో ఆమె తన ఎద సంపదకు మెరుగులు దిద్దటం ఆపేసి పెదవులకు మరింత మెరుపు పెట్టే పనిలో ఉందట. ఇలా హాలీవుడ్ అడల్ట్ స్టార్స్ తమ తమ అందాలతో నెటిజన్లను మహా మత్తులో ముంచేస్తున్నారట.
చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ హీరో రేంజ్‌కు ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరుతో పాటే తేజకు కులపిచ్చి కూడా కాస్త ఎక్కువగానే ఒంటబట్టినట్టు రాజధాని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. సాధారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో చౌదరి, రెడ్డి, కాపు వర్గాల వారే హవా సాగిస్తుంటారని చెపుతారు. అయితే, వీరి మధ్యలో కొంతమంది "రాజు" వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ... వారి ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో ఈ వర్గం (రాజు) తరపున హీరో రవితేజా వకాల్తా పుచ్చుకుని మీసం మెలేస్తున్నట్టు సమాచారం. అందుకే, రాజు వర్గానికి చెందిన హీరో కృష్ణంరాజు, నిర్మాత అర్జున రాజు, హీరో ప్రభాస్, మరికొంత మందిని పోగేసి సభలు సమావేశాలు గట్రా నిర్వహిస్తున్నట్టు వినికిడి. అంతేకాకుండా, వివిధ విభాగాల్లోని ఆ వర్గం వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. తన వారిని ప్రోత్సహించడంలో తప్పులేదు కానీ.. ఏకంగా.. ఓ వర్గానికి నాయకత్వం వహిస్తే మాత్రం హీరో గారికి భవిష్యత్‌లో తిప్పలు తప్పవని టాలీవుడ్ తలపోస్తోంది. చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ హీరో రేంజ్‌కు ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరుతో పాటే తేజకు కులపిచ్చి కూడా కాస్త ఎక్కువగానే ఒంటబట్టినట్టు రాజధాని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. సాధారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో చౌదరి, రెడ్డి, కాపు వర్గాల వారే హవా సాగిస్తుంటారని చెపుతారు. అయితే, వీరి మధ్యలో కొంతమంది "రాజు" వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ... వారి ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో ఈ వర్గం (రాజు) తరపున హీరో రవితేజా వకాల్తా పుచ్చుకుని మీసం మెలేస్తున్నట్టు సమాచారం. అందుకే, రాజు వర్గానికి చెందిన హీరో కృష్ణంరాజు, నిర్మాత అర్జున రాజు, హీరో ప్రభాస్, మరికొంత మందిని పోగేసి సభలు సమావేశాలు గట్రా నిర్వహిస్తున్నట్టు వినికిడి. అంతేకాకుండా, వివిధ విభాగాల్లోని ఆ వర్గం వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా మరింత ప్రోత్సహిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. తన వారిని ప్రోత్సహించడంలో తప్పులేదు కానీ.. ఏకంగా.. ఓ వర్గానికి నాయకత్వం వహిస్తే మాత్రం హీరో గారికి భవిష్యత్‌లో తిప్పలు తప్పవని టాలీవుడ్ తలపోస్తోంది.
నిండైన పరువాలతో పిచ్చెక్కించే అందం తన సొంతం అని చెప్పే బాలీవుడ్ బాంబ్‌షెల్ ముగ్ధా గాడ్సే సంచలనమైన స్టేట్మెంట్లివ్వడంలో దిట్ట. ఇటీవల "ప్రేమ- ప్రియుడు" అనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మగాళ్లు గుండెలు గుభేలుమనే సమాధానమిచ్చిందట ముగ్ధా.
వివరాల్లోకి వెళితే... గాడ్సేను ఓ బాలీవుడ్ సినీ విలేకరి, " ఎవరైనా మగాడు నిన్ను ప్రేమించి.. ఆ తర్వాత మోసం చేస్తే ఎలా ఫీలవుతావు" అని ప్రశ్నించాడట. దాంతో ముగ్ధా ఎంతమాత్రం తడుముకోకుండా, "మోసం చేయడం మగాడికే కాదు.. ఆడాళ్లకూ తెలుసు. కాకపోతే స్త్రీలు మోసం చేస్తే మగాడు మటాష్ అయిపోతాడు.
నన్ను గనుక ఎవరైనా మోసం చేస్తే.. అతగాడినే తిరిగి నేను మోసం చేయగలను. ఎలా మోసం చేస్తారూ...? అని అడగకండి. నేను ఇచ్చిన షాక్‌తో ఆ మగాడు అతను ఉన్న చోటును వదిలి పిరికి పందలా పారిపోతాడు" అని చెప్పిందట. అయ్యబాబోయ్... దిమ్మతిరిగే సమాధానం. ఇంతగా చెప్పిన తర్వాత ఏ మగాడైనా ముగ్దాను మోసం చేయాలని సాహసిస్తాడా.. ఏంటి?
సాధారణంగా సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడే ముద్దుగుమ్మలు కాలు జారడం సహజమని అంటుంటారు. అపుడే వారికి అవకాశాలు వస్తాయన్నది సినిమావాళ్ల వాదన. అయితే, కొంతమంది హీరోయిన్లు మాత్రం.. ఏ ఒక్కరికీ లొంగకుండా, కాలు జారకుండా అవకాశాలు సంపాదించుకుంటున్నామని బయట ప్రగల్భాలు పలుకుతుంటారు.
ఇలాంటి వారి కోవలో అయేషా టకియా ఒకరు. నాగార్జున "సూపర్" చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తాను అలాంటిదాన్ని కాదని ఢంకా బజాయిస్తోంది.
సినిమా అవకాశాల కోసం తాను ఎనాడూ ఎవరికీ లొంగలేదని చెపుతోంది. ఇప్పటివరకూ వివిధ పరిశ్రమల్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరికీ తను తలవంచలేదనీ, తాను కన్యగానే ఉన్నానని చెపుతోంది. తన కన్యత్వాన్ని తన భర్తకి పరిపూర్ణంగా సమర్పించాలన్న లక్ష్యంతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని చెపుతోంది. ఇది నిజమేనా అని.. ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎందుకంటే.. తన తొలి చిత్రం "సూపర్"లోనే తాను చేసిన అంగాంగ ప్రదర్శన "సూపర్" అని ప్రేక్షకులు చర్చించుకున్న విషయం తెల్సిందే.
ఆస్కార్ అవార్డుల విదేశీ చిత్రాల విభాగం కింద ఈ ఏడాది భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ఎంపికైంది.రంగస్థల నటుడు-దర్శకుడు పరేష్ మోకాక్షి తొలి చిత్రమిది. విదేశీ చిత్రాల విభాగం కింద అధికారిక ఎంట్రీగా ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసినట్టు మోకాక్షి తెలిపారు. ఇటీవలే విడుదలై విజయవంతమైన 'న్యూయార్క్', 'ఢిల్లీ 6' వంటి సుమారు 15 చిత్రాలతో పోటీపడి 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ' ఈ ఘనతను దక్కించుకుంది.
భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే 1913లో ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్ గా 'రాజా హరిశ్చంద్ర' ను తీసేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారో 'హరిశ్చంద్రచీ ఫ్యాక్టరీ'లో దర్శకుడు పరేష్ మోకాక్షి చూపించబోతున్నారు. 2004లో ఎంపికైన 'శ్వాస్' తర్వాత దేశం నుంచి ఆస్కార్ కు ఎంపికైన రెండో మరాఠీ చిత్రం ఇది కావడం విశేషం. ఇది లో-బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ అనీ, జనవరిలో షూటింగ్ పూర్తయిందనీ మోకాక్షి తెలిపారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, గౌరవం ఈ చిత్రానికి దక్కాయనీ, త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు. ఆస్కార్ కోసం వచ్చే నెల నుంచి తన సినిమాకి ప్రమోషన్ వర్క్ మొదలుపెడతాననీ, ఈ దిశగా ఎంతో అనుభవం ఉన్న అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్, 'శ్వాస్' దర్శకుడు సందీప్ సావంత్ తనకు సహకరించనున్నారనీ ఆయన పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. "రాజశేఖర్ రెడ్డి" అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ రెడ్డి హీరో పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది. ఇదిలావుండగా, ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను స్వీకరించిన పూరీ జగన్నాథ్.. తన సొంత బ్యానర్ వైష్ణో ఆర్ట్స్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, తన తండ్రి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ సినిమా తీయాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే స్వయంగా పూరీ జగన్నాథ్‌ను కోరారట. ఇందుకోసం ఆయనకు రెమ్యునరేషన్‌గా నాలుగు కోట్ల రూపాయలను ముందుగానే చెల్లించినట్టు రాజధాని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తన సొంత వ్యయంతో పూరీ బ్యానర్‌పై వైఎస్ జగనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే యువ పారిశ్రామికవేత్తగా మంచి పేరు సంపాదించిన జగన్.. చిత్ర నిర్మాతగా కూడా రాణించాలని ఆశిద్ధాం.
మురుగన్ ఓ కౌబాయ్ అతను శాఖహారి ప్రపంచానికి ఉపయోగపడేది ఏదైనా చేసే తత్వంకలవాడు శాఖహారం శరీరానికి మంచిదని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు అందుకే తనని తాను క్విక్ గన్ మురుగన్ అని పిలుచుకుంటాడు ఈ మురుగన్ పాలిట ఒ రెస్టారెంట్ ఓనర్ విలన్ అయి కుర్చుంటాడు అతనికి బుద్ది చెప్పే కధ తో క్విక్ గన్ మురుగన్ రూపొందించబడింది మంచి సందేశాత్మక చిత్రం ఆ నలుగురు,మీ శ్రేయోభిలాషి తరువాత మంచి సందేశాత్మక చిత్రం తో రాజేంద్రప్రసాద్ మనముందుకు రాబోతున్నాడు ఈ చిత్రం లోని మరో విశేషం మ్యాంగో డాలీ అనే పాత్రలో రంభ నటించింది ఈ చిత్రం ఈప్పటికే హింది-ఇంగ్లీష్ లో విడుదలయె మంచి విజయం సాధించింది దసర సెలవలలో పిల్లలని పెద్దలని అలరించడానికి ఈ నెల 25న విడుదల కాబోతుంది
ఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు... ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యారాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్. వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యారాయ్ తనతో "అలా ఉంది... ఇలా ఉండేది..." అని లేనిపోని మాటలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో అందరికీ తెలుసుననీ, అయినా వివరించాల్సి వచ్చింది కనుక విడమర్చి చెపుతున్నామని గోల చేస్తున్నారట. అది ఆ నోటా.. ఈ నోటా తిరిగి చివరికి ఐష్ చెవికి చేరిందట. ఈ మాటలను విన్న ఐశ్వర్యారాయ్ వలవల ఏడ్చేసిందట. గద్గత స్వరంతో ఐష్, తనకు ఇష్టమైన దారిలో తన జీవితాన్ని గడుపుతున్నానని భోరున ఏడ్చేసిందట. అయితే వివేక్ మాత్రం తన కెరీర్ మటాష్ అవడానికి కారణం ఐశ్వర్యారాయేనని పళ్లు నూరుతున్నాడట. అంతేకాదు తన సన్నిహితులతో ఈ విషయాన్నే చెపుతున్నాడట. సల్మాన్ సైతం తనతో డేటింగ్ చేసిన వివరాలను పూసగుచ్చినట్లు ఇంటర్వ్యూల ద్వారా ఏకిపారేస్తున్నాడట. ఐశ్వర్యారాయ్ శ్రేయోభిలాషులు మాత్రం, వివేక్, సల్మాన్లిద్దరూ విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారనీ, ఒక స్త్రీ వివాహంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక ఆమె గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలుకుతున్నారట.
కత్రినా టురుక్యూట్ ! ఈ పేరు ఎప్పుడైనా విన్నారా...ఇది కత్రినా అసలుపేరంట. తన పాస్‌పోర్టులో ఇలానే ఉందట. బూమ్ చిత్రం ద్వారా పరిచయమైన కత్రినా కైఫ్ కాశ్మీరీ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిందట. తండ్రి మహ్మద్ కైఫ్, తల్లి క్రిస్టియన్‌కు చెందిన సుజానే టుర్క్యూట్. హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా ఇంగ్లాండ్‌లో పెరిగి, ముందుగా మోడలింగ్‌లో చేరి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిందట. ఈ వివరాలన్నీ కత్రినా చెబుతోంది. అయితే తన పేరు పలకడం కష్టం అవుతుందనీ కత్రినా కైఫ్‌గా మార్చుకుందట.
జై చిరంజీవ, నరసింహుడు, అశోక్, వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రే క్షకులకు దగ్గరనైన బాలీవుడ్ సుందరి సమీరా రెడ్డి. బాలీవుడ్లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకుని దక్షిణాది సినీ రంగంపై కాలుమోపిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవలే తమిళ హీరో సూర్య సరసన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" సినిమాలో నటించింది. ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉంటోన్న సమీరాను పలకరిస్తే.. ఏకంగా డేటింగ్‌కు రెడీ అంటోంది. కాకపోతే తనకు కావాల్సిన లక్షణాలు మాత్రం ఆ యువకుడిలో పుష్కలంగా ఉండాలని చెబుతోంది. అవేమిటో బయటికి చెప్పనని, సస్పెన్స్ అని ట్విస్ట్ పెడుతోంది. అయితే ఒక క్వాలిఫికేషన్‌ను మాత్రం నోరు విప్పి చెప్పింది. డబ్బున్న బాయ్‌ఫ్రెండ్ అయితే ఎంతో మేలని అంటోంది. "మాది వ్యాపార కుటుంబం. అలా అని పెద్ద తారల్లా క్రికెట్టీమ్ను కొనుక్కునే శక్తినాకు లేదు. అదికావాలంటే డబ్బున్న బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవాల్సిందేనని మొహమాటం లేకుండా చెబుతోంది. ఇటీవలే తన బాడీసైజ్ను తగ్గించుకున్న ఈ భామ తాజాగా.. "రెడ్ లైట్", "ధనాధన్" చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తయ్యాక దక్షిణాది సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ఇంతకీ ఏ భాషో స్పష్టంగా చెప్పలేదు మరి. ఇంకేముంది..? సమీరాకు డబ్బుతో పాటు ఆమెకు కావాల్సిన లక్షణాలు గల బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడో? వేచిచూడాల్సిందే..!.
పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది. విహానంతరం ఆర్తీ హీరోయిన్గా చేస్తున్న చిత్రం "నీలవేణి". ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండు పాత్రల్లో కనిపిస్తోంది. మొదటి భాగంలో తన తనువు ప్రియుడికి అంకితం చేసే క్యారెక్టర్. ఈ సందర్భంలో బాలీవుడ్ మోడల్, నటుడు ముకుల్‌తో లిప్‌కిస్ ఇచ్చింది. ఈ కిస్కు సంబంధించిన ఫోటోలు హాట్ హాట్‌గా రాజధాని ఫిల్మ్ నగర్ వాసులు కళ్ళప్పగించి చూస్తున్నారు. హాలీవుడ్ కల్చర్‌కు అలవాటైన ఆర్తీ.. ఇదంతా చిత్ర సన్నివేశంలో భాగమేనని జంకూబొంకూ లేకుండా చెపుతోంది. ఇలాంటివి భూతద్దంలో చూడరాదని హితవు పలుకుతోంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటివి మామూలేనని, పైగా అక్కడ మనలాగా ఎక్స్పోజింగ్స్ పాటలు, సన్నివేశాలు ఉండని అంటోంది. సినిమాను సినిమాగానే చూడాలే గానీ మరో కోణంలో చూడరాదని నీతులు వల్లె వేస్తోంది. ఎంతైనా.. సినీ హీరియిన్ కదా
త్రిష తాగితే తాగింది..మళ్ళి నోరు ఇంత చేసుకుని బూతులు లంకించుకోవటమే బాగోలేదు..అయినా ఇంతకు ముందు గుట్టుగా నడిపే త్రిష నైట్ పార్టీలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. రాత్రయితే చాలు తాగటం..ఆపై నోటికొచ్చినట్లల్లా వాగటం...పగలు ఏం తెలియనట్లు అమాయికంగా ఫేస్ పెట్టడం రొటీన్ అయిపోయిందని కోలీవుడ్ వాపోతోంది. అసలు ఆమె ఏ హీరోని కలిసి పలకరించినా ఈ రాత్రికి పార్టీ ఎక్కడ అని రెండో క్షణంలో అడుగుతోంది.అలాగే ప్రతీ రాత్రి ఎక్కడో చోట పార్టీకి అటెండయి నానా అల్లరీ చేస్తోంది.ఈ మధ్య తాజాగా విశాల్ ఇంట్లో పార్టీ ప్రారంభించించది. విశాల్ సరసన సెల్వరాఘవన్ సినిమాలో బుక్కయిన సందర్భంగా ఓ పార్టీని ఏర్పాటు చేసింది.
అయితే విశాల్ తన పాత పరిచయం నయనతారను కూడా పిలిచాడు. దాంతో మొదట త్రిష,నయనతార ఇద్దరూ కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుకున్నారు. మెల్లిగా పెగ్గు లోపలికి వెళ్ళి పనిచేయిటం ప్రారంభించాక తమ మనస్సులో ఉన్న భావాలను బయిటపెట్టుకోవటం ప్రారంభించారు. ఒకరిపై మరొకరికి ఉన్నవన్నీ బూతులు రూపంలో లంకించుకున్నారు.కాస్సేపటకి నయనతార సైలెంట్ అయినా త్రిష మాత్రం రెచ్చిపోతూ...ఆమెను దుమ్మెత్తి పోసేసింది. తన కెరీర్ కి అడ్డువస్తున్నావంటూ ఎక్కడెక్కడవన్నీ కక్కేసింది. ఇక అదే పార్టీలో రమ్యకృష్ణ,ఆమె సోదరి కూడా వినయ్ కృష్ణన్ ఉన్నారు. అంతా అర్ధరాత్రి దాటాక వెళ్ళిపోయారు. కానీ త్రిష మాత్రం అక్కడే ఉండి తెల్లారి ఆమె తల్లి వచ్చి తీసుకెళ్ళేదాక ఆగింది. అదీ మన తారల తీరు.