Free SMS And Earn Part Time Money







11/19/10

ఆరెంజ్ సినిమా ఖలేజా చిత్రాన్ని రిప్లేస్ చేస్తోంది


మొత్తనికి రాంచరణ్ తేజ ఆరేంజ్ సినిమా ఖచ్చితంగా 26న విడుదల కానుంది. 26 అంటే వచ్చే శుక్రవారం ధియేటర్స్ లో విడుదల అవుతుంది. ఈ సంధర్భం గా ఆరెంజ్ మూవీ ఫస్ట్ లిస్ట్ [హైదరబాద్] బయటకొచ్చింది. Asian Films ఆరెంజ్ మూవీని విడుదల చేస్తోంది నిజాం ఏరియా లొ మొత్తం 55 ధియేటర్లలో విడుదల కాబోతుంది ఇంకా విడుదల టైం కి పెరగచ్చు. మరొ విషయం ఏమిటంటె ఆరెంజ్ మూవీ ఖలేజా చిత్రాన్ని రిప్లేస్ చేస్తోంది దేవి ధియేటర్ లొ [ఆర్ టి సి క్రాస్ రోడ్] అంటే ఇ సారి మహేష్ బాబు సినిమా హైదరబాద్ లొ 100రోజులు ఆడకపోవచ్చు. ఈ సంవత్సరం క్లోజ్ ఫ్లేప్స్ లొ ఖలేజా ఒకటి అని చెప్పచ్చు......!

పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్


పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. తమిళంలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వేదం, మర్యాదరామన్న చిత్రాలు నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2011 ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలుకానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు.

పవన్ కల్యాణ్ చిత్రానికి యువన్ శంకర్ స్వరాలు అందించడం ఇదే ప్రథమం. గమ్యం, వేదం, చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చడం విశేషం. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ లుక్ విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు: నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ, కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: విష్ణువర్థన్

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ ఇండస్ట్రిలోకి రావటానికి చాన్స్ కోసం చూస్తున్నాడు.....!





సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అవటమంటే చాల తేలికయిపోయింది కామన్ గా అందరు చేసేస్తున్నారు చాల రీసెంట్ గా చిరంజీవి నెఫ్యూ ధర్మ తేజ "రేయ్" అనే సినిమాలో హీరొగా పరిచయం అవబోతున్నాడు ఈ చిత్రం వై.వి.యస్ చౌదరి దర్శకత్వం చేస్తున్నాడు అ తరవాత మహేష్ బాబు బ్రదర్ నాగ సుధీర్ "యేమాయ చేసావే"లో సమంతా బ్రదర్ గా చేసిన తరవాత హీరోగా చేయటానికి ఎంతొ ఉత్స హంతో ఉన్నాడు. దీని తరవాత మహేష్ బాబు మేనల్లుడు అశోక్ ఇండస్ట్రిలోకి రావటానికి చాన్స్ కోసం చేస్తున్నాడు.....! అశోక్ సూపర్ స్టార్ క్రిష్ణ ఎల్డర్ డాటర్ సన్

"నేను నా రాక్షసి" తెలుగు సినిమా ఇండస్ట్రి రికార్డులన్ని తుడిచి పెట్టుకుపొవాలనే యేం


లీడర్ తో హిట్ కొట్టి తన రెండవ చిత్రం "నేను నా రాక్షసి" తెలుగు సినిమా ఇండస్ట్రి రికార్డులన్ని తుడిచి పెట్టుకుపొవాలనే యేం తో తీస్తున్నారు రాణ , పూరి జగన్నాధ్ ఈ మూవీ ధియేటర్స్ కి వచ్చేసరికి ఇంతవరకు ఎవరు తీయని విధముగా ఉంటుందని చెబుతున్నాడు.

పూరి
దీని మ్యూజిక్ ముగ్గురు కంపోజర్స్ తో అదిరిపోయే రేంజ్ లొ కంపోజ్ చేయిస్తున్నాడు పూరి ఒకరు విశాల్ , శేఖర్ విశ్వ మరొకరు బపి లహరి[బప్పి లహరి కొడుకు] విశాల్ ,విశ్వ మాట్లడుతు ఈ సినిమా ప్రోడ్యుసర్ తమని ఎన్నడూ వినని మ్యూజిక్ కావలని అడిగారు దానికి తగ్గట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో ఈ మ్యూజిక్ ఉండబోతోందని చెబుతున్నారు.

ఈ సినిమా జనవరి లో ధియేటర్స్ లోకి వస్తుంది సంక్రాంతి పండగ చూపించటానికి అని పూరి చెబుతున్నడు......!

Kamalinee not happy with Nagavalli?


కమలిని ముఖర్జీ ఈ పేరు వినగానే ఈ మధ్య ఈమె నటించిన Kutty Srank గుర్తొస్తుంది అందులొ ఆమె చేసిన నగ్నంగా కనపడే సీన్ కోసం అందరు తెగ నెట్ లలో చూస్తున్నారు దీనితో పాపులర్ అయిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ లొ లక్ పరీక్షించుకుంటోంది నాగవల్లి సినిమా లో ఈమె ఐదుగురు హీరొయిన్లలో ఒకరిగా తెలుగు ఇండస్ట్రి టాప్ హీరొ వెంకీ తో చేయబోతోంది

కాని ఈమెకు ఈ పాత్ర సరిగ్గ నచ్చలేదని సమచారం తెలుగులో అనుష్క తరవాత సినిమాలోని ఐదుగురిలో నాకె మంచి పేరుందని కాని ఆమె కి తగ్గ పాత్ర సినిమాలొ కల్పించలేదని స్క్రిన్ పై ఇతర హిరోయిన్స్ కంటె తక్కువ కనిపించటం తో ఇమేజ్ దెబ్బతింటుందని భావించి ఆడియొ ఫంక్షన్ కూడ అటెండ్ కాలేదట.

Kamalinee is currently playing Venu’s love interest in Malayalam hit CID Moosa remake.



నాగార్జున "గగనం" చిత్రం రిలీజ్ మళ్ళీ వాయిదా పడింది


నాగార్జున "గగనం" చిత్రం రిలీజ్ మళ్ళీ వాయిదా పడింది. ఈ చిత్రం జనవరి 1వ తేదీకి వాయిదా వేసినట్లు దిల్ రాజు ఆ మధ్య చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు కారణం ఈ చిత్రాన్ని తీసుకోవటానికి ముందుకు ఎవరూ రావటం లేదని అని అంతర్గత వర్గాల సమాచారం.

ఇక ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు.."హైజాక్‌ నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది. తెలుగులో ఈ తరహా చిత్రం రావడం ఇదే తొలిసారి. ప్రతి సన్నివేశం ఉత్కంఠను కలిగిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించడం వల్ల నిర్మాణపరంగా జాగ్రత్తలు తీసుకొన్నాం. ఇదో ప్రయోగాత్మక చిత్రమే అయినా వాణిజ్య అంశాలు అన్నీ ఉంటాయన్నారు. విమానం హైజాక్‌, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది అన్నారు.


అలాగే గగనంలో తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ...కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్‌ హైజాగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్‌ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్‌ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌ అని చెప్పాలి. మంచి ఎమోషనల్‌ డ్రామా కూడా ఉంది.

తెలుగులో ‘గగనం’ పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో ‘పయనం’ పేరుతో రానున్నది. ఈ చిత్రంలో కత్తి లో చేసిన సనాఖాన్ ప్రయాణికుల్లా చేస్తోంది.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌,

కళ: కె.కబీర్‌,

సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

Kajal Sister Nisha Exclusive Interview


అక్కయ్య కాజల్ అగర్వాల్ హావభావాలనే కలిగి ఉన్న నిషా అగర్వాల్ నటించిన తాజా చిత్రం "ఏమైందీ ఈ వేళ". ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న నిషా మామూలుగా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం...

మీరు బాగా ఇష్టపడేది..?
నా సోదరి.. కాజల్ అగర్వాల్.

అదిసరే... మీకు బాగా నచ్చే వస్తువు ఏదో చెప్పండి..?
ఫోన్. ఫోన్‌లో ఇష్టమైన వ్యక్తులతో ఎంతో ఇష్టంగా మాట్లాడుకోవచ్చు. సోదరి కాజల్‌తో మాట్లాడుతుంటే టైమే తెలియదు.

మీ అందం వెనుక ఉన్న రహస్యం...
? 8 గంటలు నిద్రపోతా. ఇష్టమైన ఆహారాన్ని సుష్టుగా భోం చేస్తా

బాగా నచ్చే దుస్తులేమిటో....?
నలుపు, తెలుపు కాంబినేషన్ వస్త్రాలంటే ఎంతో ఇష్టం.

సెక్సీగా కనబడటమంటే...? దుస్తులను తగ్గించి కనబడటం మాత్రం కాదు. అదో ఆర్ట్. ఆ ఆర్ట్‌ను సంపూర్ణంగా ఉపయోగించుకుంటే నిండుగా వస్త్రాలను ధరించి కూడా మహా సెక్సీగా కనబడవచ్చు.

మితిమీరిన ట్రెండ్ ఏమిటంటారు..?
సైజ్ జీరో. ఇపుడు దీనిపై నటీమణులే కాదు యువతుల కూడా కుస్తీలు పడుతున్నారు.

ధరించడానికి ఇష్టపడేవి...
జీన్స్, టీ షర్టులు, ఫార్మల్ సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు అని చెప్పింది నిషా.

11/18/10

రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో తాను టైగర్ అనే చిత్రాన్నిచుశాడట


రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో తాను టైగర్ అనే చిత్రాన్ని చూసానని, అది ఓ రబ్బిష్ సినిమా అని అన్నారు. అలాగే అది టైగర్ కాదని నిజానికి అది పిల్లి అని, చాలా సీన్స్ లో అది ఎలుక అని కామెంట్ చేసారు. అది చూసిన వారంతా పవన్ కళ్యాణ్ చిత్రం పులికి కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గురించి ఇన్ డైరక్ట్ గా కామెంట్ అని ఫిక్స్ అయ్యారు.

అయితే ఓ మీడియా వ్యక్తి మాత్రం ఉండబట్టలేక వర్మని ఈ విషయమై కాంటాక్ట్ చేసారు. దానికాయన వెంటనే ఈ టైగర్ గురించి ఆ తర్వాత ట్వీట్ లో మరింత విస్తారంగా రాసా చదవలేదా అన్నారు. ఆ తరువాత ట్వీట్ లో ఏం రాసాడంటే...అది ఆంధోని క్విన్స్...టైగర్స్ డోంట్ క్రై చిత్రమని, కాన్సెప్ట్ వైజ్ గా గొప్ప సినిమా అని, అయితే ఫెరపార్మెన్స్, టేకింగ్ వైజ్ గా చెత్త చిత్రమని రాసారు. దాంతో కావాలని జనాన్ని మిస్ లీడ్ చేసి పవన్ పులి ని గుర్తు చేయటానికా లేక 1981లో విడదలైన టైగర్స్ డోంట్ క్రై చిత్రాన్ని నిజంగానే చూసి ట్వీట్ చేసారా అన్నది సందేహంగా మిగిలిపోయింది. అయితే ముప్పై ఏళ్ళనాటి ఓ ఫ్లాప్ చిత్రాన్ని హఠాత్తుగా గుర్తు చేసుకుని, ట్వీట్ చేయాల్సినంత పనేమి వచ్చిందనేది అందరికీ మరో సందేహం కలిగే అంశం.




Harry potter Deathly Hallows Part 1 Trailer 2 Official HD








"జగమేలే శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా".పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఖుషిగాSONG


Power STAR పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఖుషిగా యూనిట్ ఈ రోజు సౌత్ ఆఫ్రికా చేరుకుంది. అక్కడ మిగిలిన షెడ్యుల్ పూర్తిచేయనుంది హీరొయిన్ త్రిష ఈ షెడ్యుల్ లో పాల్గొంటుంది. రెండవ హిరోయిన్ కీర్తి కిర్ బందా ఆల్ రెడీ షూటింగ్ లొనే ఉంది ఈ సినిమా మొదటి షెడ్యుల్ వారణాసి లొ జరిగింది. కొన్ని సీన్ లు రెండు పాటలు పూర్తి చేసుకుంది "వయ్యరాల జాబిల్లి" ఒకటి రెండోది శివునికి సంబందించింది దాని లెరిక్స్"జగమేలే శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా". ఈ షూటింగ్ ఫిబ్రవరీ లొ పూర్తవుతుంది.

వరల్డ్ వైడ్ విడుదల ఏప్రెల్ మొదటివారం లొ ఉంటుంది .


జయంత్ , సి.పరంజ్ ఈ చిత్రానికి దర్శకులు

బడె రవి కిరణ్ ప్రెజెంట్ చేస్తున్నాడు.


ఈ సినిమా "హింది చిత్రం లవ్ ఆజ్ కల్ "రిమేక్.

3Idiots in telugu 3 Rascals

NTR rachcha opening

Kshetram Movie Opening Pics


"ఏ మయింది ఈ వేళ " సక్సెస్ మీట్


కొత్తబంగారం హిరో వరుణ్ సందేష్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ నటించిన "ఏ మయింది ఈ వేళ " సక్సెస్ మీట్ నిన్న ప్రసాద్ ల్యాబ్[హైదరబాద్] లో జరిగింది ప్రొడ్యుసర్ రాధ మోహన్ మాట్లడుతు ఈ చిత్రం లో ఎటువంటి వల్గారిటి ఉండదని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిర్మించామని ఎవరైన చూడదగ్గ చిత్రం మంచి మెసేజ్ ఉన్న చిత్రం. వరుణ్ కి నేను స్పెషల్ గా టేంక్స్ చెప్పాలని కాఫి షాప్ లో ఈ కధ వరుణ్ కి చెప్పానని 15 మినిట్స్ లో ఓకె చెప్పడని ఈ సినిమా నా కెరీర్ లోనే బిగ్ హిట్ అని డైరక్టర్ సంపత్ నంది చెప్పాడు. హీరొ వరుణ్ మాట్లడుతు డైరక్టర్ సంపత్ నంది టేలెంటెడ్ డైరక్టర్ అని నేను సంపత్ తో వర్క్ చేయడం గొప్ప ఎక్స్పిరియన్స్ అని ఈ చిత్రం క్రెడిట్ అంత సంపత్ కె దక్కుతుందని చెపాడు.
ఈ సక్సెస్ మీట్ లో హిరోయిన్ నిషా అగవాల్ , హసిని , సౌమ్య ,యం.యస్.నారయణ , సత్య నారయణ యూనిట్ సభ్యులు విచ్చేశారు..........!

11/17/10

"నాగవల్లి" సినిమా కధ బయటపడిపోయింది:అనుష్క నాగవల్లి కాదు మరి ఎవరు




ఫ్యామిలి హీరో వెంకటేష్ నటిస్తున్న "నాగవల్లి" సినిమా కధ బయటపడిపోయింది ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అవటానికి సిద్దమవుతోంది ఈ సినిమా లో వెంకటేష్ డెబల్ రోల్ చేస్తున్నాడు ఒకటి మ్యెజిషియన్ గా "రామచంద్ర ఆచార్య" రెండు సైకాలజిస్ట్ గా Dr.విజయ్

అనుష్క:సరస్వతి ,

పూనం కౌర్:నీత ,

కమలిని:గౌరి

విమల రామన్ మెయిన్ రోల్ నాగవల్లి


కధలోకి వెళితే మైసూర్ లోని ఒక కుటుంబం పెయింటింగ్ ని చూసి డిస్టర్బ్ అవుతారు అ పెయింటింగ్ పేరు నాగవల్లి కుటుంబ సభ్యులయిన స్వాతి , గౌరి , నీత
నాగవల్లి వల్ల సైకలాజికల్ గా బాగ బాధపడుతు ఉంటారు . ఫ్యామిలి మెంబర్స్ అంతా ఒక నిర్ణయం తీసుకుని సైకాలజిస్ట్ రామచంద్ర ఆచార్య [Venkatesh] ని కలవటానికి డిసైడ్ అవుతారు ఈ ప్రొబ్లం సాల్వ్ చేయటానికి వచ్చిన వెంకటేష్ నాగవల్లి ఎవరు కనుక్కొంటాడు. అ ప్రొసెస్ లో 125సంవత్సరాల క్రితం కి వెళ్ళవల్సి వస్తుంది అప్పటి రాజు[విజయేంద్ర బహుద్దుర్[Venkatesh] నాగవల్లి] కి మద్య ఎం జరిగిందో తెలుసుకుని ఏ0 చేస్తాడన్నది మిగిలిన కధ


cinimavinodam.blogspot.com

"కందిరిగా" ఇప్పుడు హైదరబాద్ ఓల్డ్ సిటిలో


దేవదాసు రాం హీరొగా షూటింగ్ జరుపుకుంటున్న "కందిరిగా" ఇప్పుడు హైదరబాద్ ఓల్డ్ సిటిలో షూటింగ్ జరుకుంటోంది ఈ షూటింగ్ వాతవరణంలో ఓల్డ్ సిటి అంతా కలర్ఫుల్ గా మారింది బక్రిద్ సందర్బం గా రాం అక్కడి ముస్లిం సోదరులతో కలిసి బక్రిద్ జరుపుకున్నాడు దీని గురించి తన ట్విట్టర్ లో ఓల్డ్ సిటి షూటింగ్ సూపర్ ఎక్స్పిరియన్స్ అని. బిర్యాని, కుర్బాని యమ్మి గా ఉన్నాయని ట్విట్ చేశాడు.

ఈ సినిమా దర్శకుడు "తొలి పరిచం:సంతోష్ శ్రినివాస్


హిరోయిన్స్:హంసిక , స్వాతి

నెగిటివ్ రోల్:[విలన్]సోను సూద్



ఈ సినిమా కామెడి ఎంటర్ టైనర్ గా రాబోతుందని రాం చెబుతున్నాడు.....!




రాం తరవాత కొత్త హిరోయిన్ ప్రియ ఆనంద్ శేఖర్ ఖమ్ముల దర్శకత్వం లో "రామ రామ క్రిష్ణ క్రిష్ణ"లో నటిస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు రాం కిది దిల్ రాజు తో రెండవ చిత్రం ఇంతకముందు హరేరామ హరేక్రిష్ణ తో హిట్ కొట్టిన ఇ పేర్ మళ్ళి తెరముందుకు రాబోతుంది

వరుణ్ సందేశ్ రాబోయే సినిమా "కుదిరితే కప్పు కాఫీ"ఈ సినిమా రిలీజ్ జనవరికి వాయిదా పడింది.


వరుణ్ సందేశ్ రాబోయే సినిమా "కుదిరితే కప్పు కాఫీ"ఈ సినిమా రిలీజ్ జనవరికి వాయిదా పడింది.మొదట ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా డిసెంబర్ లో పెద్ద హీరోల చిత్రాలు ఉండటంతో నిర్మాతా జనవరిలో రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు. డిసెంబర్లో"వెంకటేష్ నాగవల్లి" "నాగర్జున రగడ" "రవి తేజ మిరపకాయ" ఉండటంతో నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా దర్శకుడు: "తొలి పరిచం అవుతున్న రామ శెల్వ ప్రొడ్యుసర్స్:మహి & శివ

జూనియర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా భారీ చిత్రం ప్రారంభం


ఈ ఏడాది "అదుర్స్", "బృందావనం" వంటి సూపర్ హిట్ చిత్రాలతో సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కిక్ ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో డార్లింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2, షూటింగ్ నవంబర్ 17 ఉదయం 9.30 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ స్విచ్ ఆన్ చేయగా, దేవుని పటాలపై ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ ఫస్ట్ షాట్‌కి సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రం తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. ఎన్టీఆర్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయింది. డిసెంబరులో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుండి ఏకధాటిగా షెడ్యూల్ చేస్తాం. మా బ్యానర్‌కి ఇది ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది అన్నారు.
దర్శకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... నవంబర్ 16కి తారక్ హీరో అయి పదేళ్లు పూర్తయింది. నవంబర్ 17న ఈ చిత్రంతో మరో దశాబ్దానికి నటుడిగా ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు ఈ చిత్రం మరో ఎత్తు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ను చూస్తారు.


Heroine:తమన్నా


characters:ఎన్టీఆర్, తమన్నా, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు
Story: వక్కంతం వంశీ,

Producer: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్,

screen-ply Direction: సురేందర్ రెడ్డి.

Raktacharitra సినిమాలోని పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డా, వైయస్ రాజశేఖర రెడ్డా.


రక్త చరిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైయస్సార్ ను మించిన నాయకుడు దేశంలోనే లేడని వైయస్ జగన్ వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో వర్మ కామెంట్స్ వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వైయస్సార్ ఎవరంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. రక్త చరిత్ర -2లో వైయస్ పాత్ర ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయనెవరంటూ వర్మ వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు తీవ్రంగా మండిపడ్డారు. వర్మకు చంద్రబాబు, చిరంజీవి, రోశయ్య ఎవరో కూడా తెలిసి ఉండకపోవచ్చునని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గొప్ప నాయకులు తెలియనప్పుడు వర్మతో ప్రయోజనం ఏమిటని ఆయన అడిగారు. రక్తచరిత్ర -1లో స్వర్గీయ ఎన్టీ రామారావు పాత్రపై తీవ్ర వివాదం చెలరేగింది. అదే సమయంలో రెండో భాగంలో ఎవరెవరి పాత్రలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది. పరిటాల రవి హత్యకు సంబంధించిన అంశాన్ని వర్మ ఎలా చూపిస్తాడనేది ఆసక్తిగా మారింది. పరిటాల రవి హత్యకు కుట్ర జరుగుతోందని, ఆయనకు భద్రత కల్పించాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో శాసనసభలో అడిగారు. దీనిపై తీవ్ర వివాదం కూడా చెలరేగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే పరిటాల రవి హత్య జరిగింది. మద్దెలచెర్వు సూరిని వైయస్సార్ ప్రోత్సహించారని, అందులో భాగంగానే పరిటాల రవి హత్య జరిగిందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. దీనివల్ల వైయస్సార్ పాత్ర ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుందనేది మీడియా ప్రతి రోజూ ఏదో రూపంలో స్పెక్యులేట్ చేస్తూ ఉన్నది. రక్తచరిత్ర-1లో శుభలేక సుధాకర్ పోషించిన పాత్ర ఎవరిదనేది కూడా ఆసక్తిగా మారింది. సినిమాలోని పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డా, వైయస్ రాజశేఖర రెడ్డా అనేదానిపై కూడా చర్చ సాగుతూనే ఉన్నది. వైయస్సార్ కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర కూడా రక్తచరిత్ర-2లో ఉంటుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఊహాగానాల నేపథ్యంలో వర్మ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ వాయిదాపై కూడా పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మొదటి భాగంలోని పాత్రల వల్ల వచ్చిన వివాదాలు రాకుండా చూసుకోవడానికి సినిమాను రీషూట్ చేస్తున్నారా, రీఎడిటింగ్ చేస్తున్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదాల నుంచి బయటపడడానికి అది కల్పిత కథ అని వర్మ చెప్పుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఏమైనా, రక్తచరిత్ర -2 కూడా రాజకీయవర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తుందా అనేది వర్మ ఎంత కాలం సస్పెన్స్ గా ఉంచుతారనేది చూడాలి

హీరోయిన్లు అంతా రాఘవేంద్రరావుకు:jayasudha


సినిమా హీరోయిన్లు అంతా రాఘవేంద్రరావుకు డార్లింగ్ లేనని నటి, ఎంఎల్ఏ జయసుధ కితాబిచ్చింది. మంగళవారం రాత్రి ఓ ఆడియో కార్యక్రమానికి ఆమె హాజరైంది. వేదికపై రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. అయితే ఆయన మౌనమునిలా మాట్లాడలేదు.

"సెట్‌లో కూడా అలానే ఉంటారు. తీసే సన్నివేశం కెమెరామెన్‌తోపాటు నటీనటులకు చెపుతారు. ఆయనలో పట్టుదల, కసి ఉన్నా... వాటిని చిత్రానికే వాడుతారు. హీరోయిన్లకు ఆయనంటే ఒకరకమైన అభిప్రాయముంటుంది" అని చెప్పింది జయసుధ.
Powered by web analytics software.