Free SMS And Earn Part Time Money







1/14/11

Dont Follow This ads


సెక్సీ బ్లాక్ స్వాన్ హీరోయిన్ నటాలీ పోర్ట్ మెన్ ఇటీవల ప్రెంచి ప్యాషన్ క్రిస్టియన్ డైర్ అనే ఫెర్ ప్యూమ్ యాడ్ లో టాప్ లేస్ గా నటించింది. ఈ యాడ్ లో నటాలీ పోర్ట్ మెన్ ఒంటి మీద బట్టలు ఏమి ధరించకుండా అర్దనగ్నంగా తలపై ఒక నల్లని బ్యాండ్ మాత్రమే ధరించి ఇచ్చినటువంటి ఫోజు యావత్ అభిమానులు మతి పోగోట్టేవిధంగా ఉందంటున్నారు.[ఈ యాడ్ కి అర్దనగ్నంగా నటించటానికి సంబంధం లేకుండా యావత్ యువతా కేరింతలు ఎందుకు వేస్తున్నారో వాళ్ళు అందుకే తీస్తున్నారు ]

ఈ యాడ్ కి సోఫియా కోప్పోలా దర్శకత్వం వహించగా నటాలీ పోర్ట్ మెన్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో నటాలీ పోర్ట్ మెన్ చాలా అందంగా చూపించారు[మొత్తమ్మ్ ఇప్పేశాక అందంగా కాక దరిద్రంగా ఉన్నా చూస్తారు ] మన సోఫియా. ఇది మాత్రమే కాకుండా నటాలీ పోర్ట్ మెన్ త్వరలో కోరియా గ్రాఫర్ తో బెంజమిన్ మిలీ పైడ్ ద్వారా తల్లి కాబోతున్న విషయం తేలిసిందే.[ఇది ఇంకా దరిద్రం ][all Indian youth and directors don't follow this director and foreign youth just think about your self and indian culture don't promote these ads]

మోనికాబేడీ వెంటనే ఓకే:పెద్దాపురంలో వేశ్య


ఆ మధ్య తాజ్‌మహల్, స్పీడ్ డాన్సర్, సోగ్గాడిపెళ్లాం, శివయ్య వంటి చిత్రాల్లో నటించిన మోనికాబేడీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ తర్వాత ఆమె Under World Don అబూసలీంతో కలిసి పోర్జరీ కేసులో ఇరుక్కుపోయి జైAdd Imageలు శిక్ష అనుభవించింది. ఆమె తాజాగా ‘దేవదాసియిన్ కథై’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.. ఈ చిత్రం గురించి దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ- కథ వినగానే మోనికాబేడీ వెంటనే ఓకే చేసిందనీ, ఆమెకు సంబంధించిన సన్నివేశాలను ముంబయిలోని స్టూడియోలో మూడు నెలలు చిత్రీకరించామన్నారు. తాను గతంలో హిందీలో ‘RDX’ అనే చిత్రానికి దర్శకత్వం వహించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో వేశ్యల జీవితాల గురించి సుదీర్ఘంగా పరిశోధించి ఈ చిత్ర కథను తయారుచేసానని తెలిపారు. నిర్మాణం దాదాపు పూర్తయిందని ఈ నెల 28న విడుదల చేయనున్నామని దర్శకుడు వివరించారు

గ్రాఫిక్స్‌ మాయాజాలమే "అనగనగా ఓ ధీరుడు:Review


నటీనటులు: సిద్దార్థ్‌, శృతి హాసన్‌, లక్ష్మీప్రసన్న, తనికెళ్ళభరణి, రవిబాబు, బేబీ హర్షిత తదితరులు, బ్యానర్‌: వాల్ట్ డిస్నీఅండ్‌ అడోబ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, ప్రకాష్‌ కొవెలమూడి, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, దర్శకుడు: ప్రకాష్‌ కోవెలమూడి.


పాయింట్‌: ప్రేతాత్మకు దైవశక్తికి మధ్య జరిగిన పోరాటమే... వాల్ట్‌డిస్నీ చిత్రమంటేనే పిల్లల చిత్రమని తెలిసిపోతుంది. రిలీజ్‌కు ముందు నిర్మాతలు కూడా ఇదే చెప్పుకొచ్చారు. ఒక చందమామ కథలా, డిస్నీఛానల్‌లో వస్తున్న ప్రోగ్రామ్స్‌లాగా ఈ చిత్రం అనిపించడం విశేషం. సిద్దార్థ ధీరునిగా బాగున్నా... గుడ్డివాడిగా మాయలు, మంత్రాలు తెలిసినవారిని ఎదుర్కోవడం అతకలేదు. శృతిహాసన్‌ పాత్ర గ్లామర్‌కే ఉపయోగించారు. మంచు లక్ష్మీప్రసన్న ప్రేతాత్మగల మంత్రగత్తెగా అలరించినా, ఓవర్‌యాక్షన్‌ చేసినట్లుగా ఉంది. టోటల్‌గా కథాగమనంలో ఫీల్‌ కలగకపోవడం చిత్రానికి మైనస్‌. పిల్లల్ని టార్గెట్‌గా చేసుకుని తీసినది ఈ చిత్రం కథ: కాలం తెచ్చిన మార్పుల్లో చరిత్ర పుటల్లో చెరిగిపోయిన ఓ రాజ్యం అంగరాజ్యం. నీటిబిందువు ఆకారంలో ఉన్న ఆ రాజ్యంలో ఐరేంద్రి(లక్ష్మీ మంచు) ప్రేతాత్మరూపంలో సర్పకన్యగా వస్తుంది. అక్కడి ప్రజల్ని నానారకలుగా హింసించి రోగగ్రస్తుల్ని చేస్తుంది. ఈ దుష్టశక్తి ఆటకట్టించాలంటే దివ్య పర్వతాల్లో ముని సంరక్షణలో ఉన్న మోక్ష అనేబాలిక వల్లే అవుతుందని తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమెకోసం బయలుదేరతాడు.

అక్కడ ఆమెను రక్షిస్తూ వుండే యోధ(సిద్దార్థ) ధీరుడుని ముని కాపలాగా పెడతాడు. కానీ అతను గుడ్డివాడు. అయినా శబ్దసాయంతో ఎంతటివారినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. సర్పకన్యకు టానిక్‌లా అప్పుడప్పుడు పోయిన శక్తిని కూడదీసుకోవాలంటే రక్తం తాగాలి. ఆ రక్తం తనకు సరిపోయే ప్రియ(శృతిహాసన్‌)ను బంధించి రోజుకూ కొద్దికొద్దిగా తాగుతుంటుంది. అయినా తృప్తిచాలక ఇంకా ఎన్నాళ్ళు తన ఆత్మ ఉన్నంతకాలం కావాలంటే ఒక్కటే మార్గం. దైవశక్తులున్న మోక్షరక్తం తాగితే చాలు ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుందని తెలుసుకుని మోక్షకోసం తన అనుచరుల్ని పంపుతుంది. అక్కడ మోక్షకోసం వెళ్ళిన వ్యక్తి మునికి పరిస్థితి వివరించి అంగరాజ్యానికి తీసుకు వస్తుంటాడు. ఇక్కడ సర్పకన్య ఆజ్ఞమేరకు ఆమె అనుచరులు బయలుదేరి వారిని పట్టుకుంటారు. అప్పుడు యోధునిగా సిద్దార్థ ఎలా కాపాడాడు? అసలు తనకు కళ్లు ఎలాపోయాయి? అనేది సినిమా.

ఆద్యంతం ఉత్కంఠను కల్గించే చిత్రాల కోవలోకి ఇది వస్తుంది. కానీ అంతటి ఉత్కంఠ ఎక్కడా కన్పించదు. పెరిగిన టెక్నాలజీ రీత్యా గ్రాఫిక్స్‌ అంతా మాయచేసి కాస్త ఓవర్‌గా ఉది. యోధునిగా సిద్దార్థ నటనలో సీరియస్‌నెస్‌ లేదు. ఏదో సరదాగా చిన్నపిల్లల సినిమాకు చేసినట్లు చేశాడు. మాడ్యులేషన్‌ సాంఘిక చిత్రాలవలే ఉంటుంది.
అంగరాజ్య పూజారిగా తనికెళ్ళభరణి అస్సలు సూట్‌కాలేదు. పూర్వీకుల నుంచి దక్కిన మాయల మంత్రాలతో శృతిహాసన్‌ ట్రీట్‌మెంట్‌లో అంగాంగ ప్రదర్శనలు ఎక్కువగా ఉన్నాయి. సర్పకన్య సేనానిగా రవిబాబు పాత్ర కాస్త హాస్యాన్ని పండిస్తుంది. మిగిలిన పాత్రలు కథలో భాగాలే అయినా గుర్తుపెట్టుకునేట్లుగా ఉండవు.

ప్రత్యేకంగా చెప్పాల్సింది ఆర్ట్‌ పనితనం, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తీరు అద్భుతమనే చెప్పాలి. ఊహా లోకంలో విహరించే ఆహ్లాదమైన జలపాతాలు, కొండలు, కోనలు చాలా బాగున్నాయి. సర్పకన్యగా ఆమెను రక్షించే వెంట్రుకలే సర్పాలుగా మారి మాట్లాడేవిధానం బాగుంది. పాటలు చిత్రానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. కొన్ని సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. టోటల్‌గా పరిశీలిస్తే... హ్యారీపోటర్‌ లాంటి చిత్రాల్లో ఇవే టెక్నాలజీ ఉపయోగించినా అందులో కథాబలం కొంత ఆకట్టుకుంటుంది. పాత్రల తీరు ఇంట్రస్ట్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి అవే లోపించాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.

అన్ని చోట్ల అడలేని చిత్రం ఈ ఒక్క చోట ఎలా ఆడిందండి? ఆడించారని తెలిసిపోవట్ల ....!ఈ పోస్టర్ చూడండి

హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు:Mirapakaya review


-సూర్య ప్రకాష్ జోశ్యుల
సంస్థ: ఎల్లో ఫ్లవర్స్‌
నటీనటులు: రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్‌, ప్రకాష్ ‌రాజ్‌, కోట శ్రీనివాసరావు,
సునీల్‌, చంద్రమోహన్‌, అలీ, సురేఖావాణి, అజయ్‌, సుధ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్
సంగీతం: తమన్
కూర్పు: గౌతమ్ రాజు
సంగీతం: తమన్‌
నిర్మాత: రమేష్‌ పుప్పాల
కధ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

గతంలో "షాక్" ఇచ్చిన డైరక్టర్ తో రవితేజ మరోసారి సాహసం చేస్తున్నాడంటే...గ్యారెంటీగా స్క్రిప్టు అధ్బుతంగా ఉండి ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేయటం సహజం. అయితే అది అత్యాసే నని, రవితేజ ఎప్పటిలాగే స్క్రిప్టు ఎలాగున్నా తనదైన టిపికల్ మ్యానరిజంస్ తో, అల్లరి చేష్టలతో సినిమాను లాగించేయచ్చు అని నమ్మి ఈ చిత్రం చేసినట్లు స్పష్టమవుతుంది. షారూఖ్ ఖాన్ హిందీ చిత్రం "మైహూనా" ను ప్రక్కన పెట్టుకుని కథ అల్లుకున్నట్లున్న ఈ చిత్రం ద్వితీయార్ధం ప్రారంభం నుండి మెల్లిగా డ్రాప్ అయిపోతూ..పోతూ...క్లైమాక్స్ కి వచ్చేసరికి పూర్తిగా జారిపోయింది. హరీష్ శంకర్...మాటల రచయితగా పంచ్ డైలాగులు వేసి నవ్వించాడు కానీ కథకుడుగా రాణించలేకపోయాడు. అలాంటి స్ధితిలో సినిమాను చివరిదాకా భరించగలిగాము అంటే అది రవితేజ ఎనర్జీతో ఇచ్చిన కిక్కే అని చెప్పాలి.

ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అయిన రిషి(రవితేజ) ఉరఫ్ మిరపకాయ ఓ మిషన్ నిమిత్తం డిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఆ మిషన్ లో భాగంగా ఓ కాలేజీలో హిందీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. ఖాళీగా ఉండటమెందుకన్నట్లు అక్కడి స్టూడెంట్ వినమ్ర(రిచా గంగోపద్యాయ్)తో ప్రేమలో పడి పాటలు పాడుతుంటాడు. ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందనగా అతనికి అప్పచెప్పిన మిషన్ పూర్తి వివరాలు తెలుస్తాయి. వాటి ప్రకారం ఆ కాలేజీ కొత్త స్టూడెంట్ వైశాలి(దీక్షా సేధ్) ని రిషి...ప్రేమలో పడేయాలని ఆ మిషన్ లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు రిషి తన ప్రేయసి ఎదురుగా వైశాలిని ఎలా ప్రేమలో దించాడు...ఇంతకీ వైశాలిని ప్రేమలో పడేయటానికి ఇంటిలిజెన్స్ కు ఉన్న కారణం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రేమ కోసం ఒకరిని, ప్రొఫెషన్ కోసం మరొకరిని ప్రేమలో పడేయటమే పాయింటు రవితేజకు నచ్చి ఈ చిత్రం ఓకే చేసి ఉండవచ్చు. కానీ నిజంగా ఓ అమ్మాయిని ప్రేమలో దింపి మాఫియాడాన్ అయిన అతని తండ్రిని పట్టుకోవాలనే వింత ఆలోచన ప్రపంచంలో ఏ ఇంటిలిజెన్స్ డిపార్టమెంట్ అయినా చేస్తుందా...చేయాలనుకున్నా ప్రేమలో దింపటమెందుకు...దొరికిన అమ్మాయిని ఏ కిడ్నాపో మరొకటో చేసి ఆమె తండ్రిని పట్టుకోవచ్చుకదా అని ఈ చిత్రం చూస్తున్నంతసేపూ తొలుస్తుంది. అలాగే విలన్(ప్రకాష్ రాజ్) పాత్ర ఎక్కడో క్లైమాక్స్ దాకా కథలోకి రాదు. అతన్నిహీరో చంపితే బాగుండును, అతను దుర్మార్గుడు కదా అనే ఆలోచన మనకు పొరపాటున కూడా కలగదు. దాంతో హీరో అతన్ని చంపుతూంటే హీరో ఎందుకిలా చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. దానికితోడు తన కూతురుని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారనే విషయం ఆ ఇంటర్నేషనల్ డాన్ కి క్లైమాక్స్ దాకా కూడా తెలియదు. దాంతో అతను హీరోని పట్టించుకోడు. హీరో కూడా క్లైమాక్స్ దాకా అతని జోలికి వెళ్లడు. దాంతో అస్సలు సినిమా ఎటుపోతుందో చూసేవారికి అర్దం కాదు.

మొదటే చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో డైలాగులు బావున్నాయి. అయితే డైలాగులతోనే సినిమా మొత్తం నడిపేయటం నచ్చదు. అలాగే దర్శకుడుగా షాక్ నాటి షార్ప్ నెస్ ఎందుకనో చిత్రంలో మిస్సైందనిపిస్తుంది. హీరోయిన్స్ ఇద్దరూ తమ పరిధులు మేరకు బాగానే చూపారు...అదే నటించారు. కోట, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కొన్ని వందల సార్లుచేసిన పాత్రే చూస్తున్నాం అనిపిస్తుంది. పాటల్లో రెండు బాగున్నాయి..ధియోటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కెమెరా, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే.

ఏదైమైనా ఇది రవితేజ సినిమా ఇలాగే ఉంటుంది అని ఫిక్సై వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాస్సేపు నవ్వుకుందామని వెళ్తే అల్లరి నరేష్ సినిమాలా ఎంటర్టైన్ చేస్తుంది.అ దే మంచి మాస్ మసాలా సినిమా చూద్దామనుకుంటే మాత్రం నిరాశపరుస్తుంది. మిరపకాయ్...ఘాటు ఉంటుందని మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.

పవన్ బాగానే ఉన్నారు..ఆయన ఇంకో సినిమాలో అప్పుడే బిజీ అయ్యారుమరి నా పరిస్థితి ఇలా: నికిషా పటేల్


పవన్ కళ్యాణ్ సరసన 'కొమరంపులి' చిత్రంలో చేసిన నికిషపటేల్‌ కి ఆ తర్వాత ఆఫర్స్ ఏమీ రాలేదు.చిన్న చితకా చిత్రాల నుంచి ఆపర్స్ వచ్చినా ఆమె రిజెక్ట్ చేసింది. ఈ నేపధ్యంలో ఆమెకు బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుభాష్ ఘయ్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె చేయబోయే పాత్ర గురించి ఘాయ్‌ నికిషకి చెప్పేశారు.

నికిష తనకు లభించిన అవకాశాన్ని అంది పుచ్చుకుంది. కేవలం గ్లామర్‌కు మాత్రమే కాకుండా కథకి, క్యారక్టర్‌కి ప్రాధాన్యత నిస్తానని నికిష చెబుతోంది. అందువల్లే ఇతర భాషా చిత్రాల నుండి అవకాశాలు వచ్చిన అంగీకరించలేదని చెప్తోంది. ఇక కొమురం పులి చిత్రం చేసిన తర్వాత నిఖిష ఓ లీడింగ్ న్యూస్ పేపరుతో తన గోడు వెళ్ళబోసుకుంది. పులి ప్లాపుతో నేనే నాశనమయ్యాను..పవన్ బాగానే ఉన్నారు..ఆయన ఇంకో సినిమాలో అప్పుడే బిజీ అయ్యారు.

ఎస్.జె.సూర్య..దర్శకుడుగా కంటిన్యూ అవుతున్నారు. ఎటొచ్చీ నా రెండున్నరేళ్ళ కెరీర్ పాడయింది. ఈ సినిమా సంతకం పెట్టేడప్పుడు ఈ చిత్రం రిలీజయితే చాలా ఆఫర్స్ వస్తాయనుకున్నాను. షూటింగ్ లో ఉండగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ నన్ను తమ కొత్త చిత్రాల కోసం సైన్ చేయమని అడిగారు.అయితే రిలీజయ్యే వరకూ వేరే చిత్రం ఒప్పుకోవద్దని ఈ పులి చిత్రం వారు చెప్పారు. ఇప్పుడు సినిమా చూస్తే ఇలా దారుణంగా ఫెయిలైంది అంది

బాలీవుడ్ అవకాశన్ని వద్దనుకున్న భామ




సెక్సీ ఇమేజ్ అంతా త్వరగా రాదట:అనుష్క శర్మ



తల్లి కాబోతున్న ఐశ్వర్య రాయ్




అనుష్క మోజులో నాగర్జున





సూపర్ నుంచి రగడ దాక హాట్ సీన్స్ నాగర్జున అనుష్క







"రగడ" చిత్రంలో నాగార్జున సరసన హాట్ హాట్ సన్నివేశాల్లో దర్శనమిచ్చిన అనుష్కను నాగ్ వదిలేటట్లు కనబడటం లేదని ఫిలిమ్‌నగర్ జనం అనుకుంటున్నారు. రగడ చిత్రం గురించి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అనుష్క పేరు ప్రస్తావించకుండా ఉండటం లేదట నాగార్జున. ప్రస్తుత ట్రెండ్‌లో తన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే నటీమణుల్లో అనుష్క ముందు వరసలో ఉన్నదని చెపుతున్నాడట. అంతేకాదండోయ్.. త్వరలో తను నటించనున్న సోషియో ఫాంటసీ చిత్రంలోనూ తనకు జోడీగా అనుష్కనే పెట్టమని అల్టిమేటం జారీ చేశాడట. నాగార్జున అంతగా చెపుతుంటే నిర్మాత మాత్రం వేరెవరినైనా ఎలా పెట్టగలరు.

1/12/11

హ్రుతిక్ పక్కనయినా రెండో Heroineగా చేయను :కంగనా


అయేషా మళ్ళీ వస్తోంది


సదా మళ్ళి తెలుగులో వెలిగేనా


శివ తరవాత అంతటి సినిమా అవుతుంది గగనం :నాగర్జున




Add Image

వన్నె తగ్గకుండా ఉండటం కోసం త్రిష నాన తంటలట



యన్.టి.ఆర్ ని బుట్టలో వేసేందుకు రాజీవ్ ట్రిక్కులు


స్టూడెంట్ నెం.1 చిత్రంలో యన్టీఆర్ కి వ్యతిరేక పాత్ర పోషించిన నటుడు రాజీవ్ కనకాలకు జూ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం..ఈ మాట చాలా సందర్భాల్లో రాజీవ్ నోటివెంట వచ్చిన విషయం తెలిసిందే..ఈ మద్యన రాజీవ్ కనకాల ఓ సందర్బంలో జూ ఎన్టీఆర్ తెలుగు భాష మాట్లాడటంలో..ఇప్పుడున్న హీరోల్లో ఎవ్వరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మించలేరు. అలాగే డ్యాన్స్ ల్లో కూడా జూ ఎన్టీఆర్ దే ది బెస్ట్ అని కితాబులిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎనర్జీ చూస్తే రాజీవ్ కనకాలకి ఆశ్చర్యం, ఆనందం వేస్తాయని అలా అతన్ని చూస్తుంటే ‘లైవ్ వైర్’లా యన్టీఆర్ ఎనర్జీ ఉంటుందని, కితాబులిస్తున్నాడు. సమయం సందర్బం లేకుండా ఈ కితాబులెందుకో అని రాజీవ్ కనకాలను ఆరాతీస్తే..మళ్ళీ జూ ఎన్టీఆర్ తో కలిసి సినిమా తీయాలనే ఇన్ని పొగడ్తలు గుప్పిస్తున్నాడని సమాచారం.

వీరిద్దరి మద్య వచ్చేటటువంటి కొన్ని సెక్సీ సీన్లు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. వీరిద్దరూ కలసి నటించినటువంటి కొన్ని బెడ్ సీన్లు సినిమా మొత్తానికి




ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం ఇద్దరూ కలసి నటించినటువంటి త్వరలో విడుదల కాబోతున్న చిత్రం సాత్ ఖూన్ మాఫ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ రుస్కెన్ బాండ్ షార్ట్ స్టోరీ ఆధారంగా చేసుకోని తీసినటువంటి మంచి కామెడీ సినిమా. ఈసినిమా మొత్తం సెక్స్, డ్రగ్స్ గురించి సాగుతుందని అన్నారు. ఈసినిమాలో విచిత్రం ఏమిటంటే హీరోయిన్ క్యారెక్టర్ పేరు సుసన్నా. సుసన్నాకు ఏడుగురు భర్తలు ఉంటారు. ఇక జాన్ అబ్రహాం విషయానికి వస్తే ఏడుగురు భర్తలలో జాన్ అబ్రహాం ఒకరుగా నటిస్తున్నారు.

ఈ సినిమా విషయానికి వస్తే వీళ్శిద్దరూ నటించినటువంటి రాబోయే కాలంలో ఓ ప్రేమ్ గా నిలచిపోతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా వీరిద్దరి మద్య వచ్చేటటువంటి కొన్ని సెక్సీ సీన్లు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. వీరిద్దరూ కలసి నటించినటువంటి కొన్ని బెడ్ సీన్లు సినిమా మొత్తానికి పెద్ద హైలెట్ అని అన్నారు. ప్రస్తుతానికి ఈచిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకోని విడుదలకు సిద్దంగా ఉంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

జాన్ అబ్రహాం మాట్లాడుతూ నాజీవితంలో ఇంతవరకు ఇలాంటి రోల్ లో నేను ఎప్పుడూ నటించలేదని అన్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా మంది అమ్మాయలతో బెడ్ సీన్లలలో నటించడం జరిగిందన్నారు. ఇక ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం విషయానికి వస్తే ఇద్దరూ బెడ్ సీన్లలలో అచ్చం చాలా చక్కగా ప్రోపెషనల్స్ మాదిరి నటించారని అన్నారు. ఇకపోతే ఈసినిమాని ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

అతను టాప్‌లెస్ ఫోజువ్వాలని చెప్పినా ఎటువంటి జంకూ లేకుండా ఇచ్చేశానంటోంది.bipasha ఎవరతను ?


బాలీవుడ్ హీరోయిన్లకు టాప్‌లెస్‌గా ఫోజిలివ్వడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఏదైనా పత్రిక టాప్‌లెస్ ఫోజు కావాలని అడిగితే చాలు... వెంటనే అందాలను ప్రదర్శించడానికి సిద్ధమైపోతున్నారు.

తాజాగా బిపాసా బసు మరోసారి తన నడుము పైగాన్నంతటినీ నగ్నంగా చూపిస్తూ మాక్జిమ్ పత్రికకు ఫోజులిచ్చేసింది. పైగా ఈ ఫోటోలను ప్రముఖ ఫోటోగ్రాఫర్ దబ్బూ రతాని తీశాడు. అతగాడు ఫోటోలు తీస్తానంటే పెద్దపెద్ద స్టార్లే క్యూలో నిలబడతారు.

టాప్‌లెస్‌గా నటించడంపై బిపాసాను కదిలిస్తే... అందాలను మరింత అందంగా ఎలా చూపించాలో దబ్బూకు తెలుసు. వల్గారిటీ లేకుండా చూస్తాడు. అందుకే అతను టాప్‌లెస్ ఫోజువ్వాలని చెప్పినా ఎటువంటి జంకూ లేకుండా ఇచ్చేశానంటోంది.

బాడీ నాదే... కానీ... దాన్ని మార్ఫింగ్‌తో మాయ చేశారని తెలివిగా చెప్పింది. దీన్నిబట్టి మనం ఏమనుకోవాలి...




ఆనంద్‌ చిత్రంలో పక్కా సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా నటించి అటు పెద్దల్ని, ఇటు యువతను ఆకట్టుకున్న కమలినీ ముఖర్జీకి ఆ తర్వాత అనుకున్న ఆఫర్లు రాలేదు. తాజాగా నాగవల్లిలో నాట్యకారిణిగా చేసింది. డాన్స్‌ బాగానే వేసిందని ప్రేక్షకులు కితాబిచ్చారు.

టాలీవుడ్ లో ఇలా ఉంటే మొన్నీమధ్య ఓ మలయాళ సినిమాలో నటించింది. అందులో నగ్నంగా కన్పించే సన్నివేశంలో చేసిందని భోగట్టా. ఇలా నగ్నంగా నటించడంపై ఆమె అభిమానులు ఆమెకు లెటర్స్‌ రాశారట.

దీనికి ఆమె స్పందిస్తూ.. ఒకనాడు నేను ఫలానా డ్రెస్‌ వేస్తే బాగుందన్నారు. మీరే ఇలా అంటే ఎలా? మలయాళంలో ఆ సన్నివేశం ఎలా వచ్చిందో... ఏమిటో తెలుసుకోవాలికదా... బాడీ నాదే... కానీ... దాన్ని మార్ఫింగ్‌తో మాయ చేశారని తెలివిగా చెప్పింది. నేను చేయలేదని మాత్రం అనలేదు. దీన్నిబట్టి మనం ఏమనుకోవాలి...?

ఫర్వాలేదనిపించే దాసరి 150 "పరమవీరచక్ర" 150 రోజుల ఆడింపు


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా, జీవా, జయసుధ, మురళీమోహన్‌, కళ్యాణి, వేద, నాగినీడు, కోటశ్రీనివాసరావు, అలీ, హేమ, ఎల్‌బి. శ్రీరామ్‌, బ్రహ్మానందం తదితరులు, కెమెరా: రమణరాజు, ఎడింటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: జి. కళ్యాణ్‌, దర్శకత్వం: దాసరి నారాయణరావు.

విడుదల: 12.1.2011

పాయింట్‌: మేజర్‌ దేశద్రోహి కాదనీ తనలాగే ఉన్న మరో వ్యక్తి నిరూపించే ప్రయత్నమే ఈ కథ.

"పరమవీరచక్ర" కథగా చెప్పాలంటే... చిన్న పాయింట్‌. దేశభక్తిని కథావస్తువుగా తీసుకుని దానికి సెంటిమెంట్‌ రంగరించి కోర్టు బోనెక్కి రాజకీయ నాయకుల తీరుపై సెటైర్లు వేసే చిత్రాల కోవలో ఇది వస్తుంది. బొబ్బిలిపులి తరహాలో ఈ చిత్రం సాగుతుంది. ఎన్‌.టి.ఆర్‌. అరెస్ట్‌ చేస్తున్న సన్నివేశంనుంచి తన వారసునిగా మళ్ళీ నేనే పుడతాననే డైలాగ్‌తో సింక్‌ చేస్తూ కథసాగుతుంది.

సినిమా హీరో చక్రధర్‌ (బాలకృష్ణ)కు మిలటరీ అధికారి (మురళీమోహన్‌) ఓ కథ చెబుతాడు. వింటూ వింటూ లీనమైపోతాడు. అతను చెప్పిన జయసింహ పాత్రను ఓన్‌ చేసుకుంటాడు. చక్రధర్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు కొండలకు తీసుకెళ్ళిన ఆఫీసర్‌ జయసింహను చూపిస్తాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని చూపించి.. కొందరు దేశద్రోహులు నిజాయితీపరుడైన చక్రధర్‌ను ద్రోహిగా చిత్రించారనీ, అందుకే ఆయన నిజాయితీని నిరూపించేందుకు అచ్చుగుద్దినట్లుండే నిన్ను వేడుకుంటున్నామని చెబుతాడు. జయసింహను చక్రధర్‌ ఎలా నిరూపించాడన్నది కథ. అలా నిరూపించే క్రమంలో సాగే సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం.

బాలకృష్ణ రెండు పాత్రల్లో పండించారు. 50లో ఉన్నా ఆ స్పీడ్‌ తగ్గలేదు. డాన్స్‌, ఫైట్స్‌ బాగా చేశాడు. డైలాగులు లెంగ్తీ లేకుండా ఉన్నాయి. సినీ హీరోగా ఆయన నిజజీవితంలోని పాత్రకు సరిపోయింది. చిత్రంలో హైలైట్‌ కొమరం భీమ్‌ పాత్ర. రావణాసురునిగా బాగా చేశాడు. అయితే కొమరంభీమ్ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడని ప్రేక్షకులు క్లాప్‌ కొట్టారు. రోయిన్లుగా మేజర్‌ భార్యగా అమీషా పటేల్‌, హీరో అభిమానిగా షీలా, కాస్త నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను నేహాధూపియా పోషించారు.

షీలాతో పాడే పాటలు కాస్త ఇబ్బంది పెట్టిస్తాయి. పక్కామాస్‌ను దృష్టిలో పెట్టుకుని పచ్చిమాస్‌ పాట సాగుతుంది. కామెడీ పండించడంలో 'రోబో'పై సెటైర్‌గా అలీ, బ్రహ్మానందం కామెడీ ఫర్వాలేదు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి మైనస్‌ సంగీతమే. పెద్దగా ఆకట్టుకోలేదు. చిత్రానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది కెమెరా పనితనం. కెమెరా ప్రజెంటేషనే ఇటువంటి కథకు కీలకం. అది కాస్త లోపించింది.

దాసరి సంభాషణలు ఫర్వాలేదు. సినిమా హీరోలు ఎక్కువ తీసుకుంటారనే దానికి ఈ చిత్రంలో వివరణిచ్చే ప్రయత్నం చేశారు. అదీగాక నిర్మాతలు తమకు ఇన్ని కోట్లు లాభం వచ్చిందనేది శుద్ధ అబద్ధమని చెబుతాడు. కథ బాగుంటే కొన్నిసార్లు పారితోషికానికి ఒత్తిడి చేయమని ఇదంతా అపోహ అని వివరణ ఇస్తాడు. మాస్‌ ప్రేక్షకుల గురించి... నేను కొట్టినా చస్తావ్‌, నన్నుకొట్టినా చస్తావ్‌.. వంటి డైలాగ్‌లూ ఉన్నాయి.

దాసరి దర్శకునిగా గతంలో పెద్ద పేరుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ వచ్చాక ఆయన చిత్రాల్లో పస కన్పించడంలేదు. 150 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని దాన్ని ప్రేక్షకుల్ని మెప్పించడంలో కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. అసలు టెక్నాలజీ లేని రోజుల్లోనే మేం సిల్వర్‌ జూబ్లీలు తీశామని దాసరి చాలాసార్లు సభల్లో చెప్పారు. సినిమా హీరోగా పలుపాత్రలు పోషించే విధానంలో దాసరి ప్రతిభ కనబడింది. ఆ పాత్రలు బాగా పేలాయి.

మొదటి భాగం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. రెండవ భాగమే కీలకం. స్క్రీన్‌ప్లేను అద్భుతంగా మలచడంలో రెండవ భాగం పేలవంగా మారింది. సెకండాఫ్‌లో వచ్చే రెండు పాటలు తీసేస్తే సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు కామెడీ ట్రాక్‌తోపాటు యాక్షన్‌ ఎపిసోడ్‌ చూస్తుంటే.. కోడిరామకృష్ణ ఛాయలు కన్పిస్తాయి.

దాసరి, సాహితీ, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌వంటివారు పాటలు రాశారు. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. టోటల్‌గా ఈ చిత్రం అంత తీసిపారేసే సినిమా కాదు. ఒక్కసారి చూడదగ్గ సినిమా. సంక్రాంతిలో తొలుత విడుదలైన సినిమా ఇది గనుక ఇంకా విడుదలకాల్సినవి ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేర
కు ఆదరిస్తారో
చూడాల్సిందే.



వన్ ఇండియా సైట్ అభిప్రాయం:పరమ వీర చెత్త

వెబ్ దునియా అభిప్రాయం:యువరత్న "పరమవీరచక్ర" కేవలం "ఒక్క రోజు సినిమా

మరికొన్ని సైట్లు పర్వలేదు

మొత్తానికి డిజేస్టర్ అయినా 150 రోజుల చిత్రం నిర్మాతకి......!
లేక పోతే దర్శకుని పరువు హీరొ ఇమేజ్ అయిపోవు

కొమరం ,ఖలేజా ,తరవాత అంతటి డిజాస్టర్ అని నా అభిప్రాయం
Powered by web analytics software.