Free SMS And Earn Part Time Money







11/15/10

సెకండ్ పార్టులో వైఎస్సార్‌ను చూపిస్తారా...?


రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర -2 ఆడియో కార్యక్రమం సోమవారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడు రాము, హీరో సూర్య పాల్గొన్నారు. సూర్య మాట్లాడుతూ... రక్తచరిత్రలో తనకు అవకాశం ఇచ్చినందుకు వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ చిత్రంలో తను నటించిన పాత్ర ఎంతో కేర్ తీసుకుని చేశానన్నారు.

ఆ తర్వాత రాంగోపాల్ వర్మపై విలేకరులు ప్రశ్నలు సంధించారు....

విలేకరిQ: రాము సర్... అసలు ఇంత హింసాత్మకమైన రక్తచరిత్రను సెన్సార్ నుంచి తప్పించి ఎలా బయటకు తీసుకరాగలిగారు..?
రాముA: సెన్సార్ గొంతు మీద కత్తి పెట్టి...( నవ్వులు)

Q: రక్త చరిత్ర -1లో ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించి వివాదానికి తెర లేపారు. సెకండ్ పార్టులో వైఎస్సార్‌ను చూపిస్తారా...?
వర్మA: ఆయనెవరు..? ఓ.. వైఎస్ రాజశేఖర రెడ్డిగారా... నేనిప్పటివరకూ కనీసం 400 సార్లైనా చెప్పి ఉంటా. నేను వ్యక్తుల చరిత్ర తెలుసుకుని కల్పించి ఈ రక్తచరిత్ర సినిమా తీశాను. అంతే....

Q: వర్మ అంటే ఎవరి మాటా వినరు.. అంటారు. మరి రక్తచరిత్ర-2లో ఏదైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా..?
వర్మA: కాంప్రమైజ్ కానా... చూడండి నాకు గాలిలో ఎగరాలని ఉంది. కానీ ఎగరలేను. కాంప్రమైజ్ అవుతున్నాగా

Q: వర్మ అంటే వివాదాల పుట్ట అంటారు.. మీ లైఫ్ మీద సినిమా తీస్తే బావుంటుందేమో..?
వర్మA: నా సినిమాలు చూడట్లేదంటున్నారు. ఇంక నా లైఫ్ మీద సినిమానా... ( నవ్వులు)
Powered by web analytics software.