Free SMS And Earn Part Time Money







2/28/11

ఆది శంకరాచార్యుని చరిత్రను సెల్యూలాయిడ్‌ కావ్యంగా తీర్చే ప్రయత్నం:జె.కె.భారవి......!




అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు వంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జె.కె.భారవి ఈ సారి పెన్నుతో పాటు మెగాఫోన్‌ పట్టుకోబోతున్నారు. భారతీయ సనాతన ధర్మం అడుగంటుతున్న దశలో ఒక సంచలన ఉద్యమస్ఫూర్తిగా ఆవిర్భవించి... అద్వైత విప్లవంతో హిందూ ధర్మాన్ని అఖండంగా అప్రతిహతంగా నిలబెట్టిన జగద్గురువు ఆది శంకరాచార్యుని చరిత్రను సెల్యూలాయిడ్‌ కావ్యంగా తీర్చిదిద్దడానికి జె.కె. కంకణం కట్టుకున్నారు. గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ నిర్మాణంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ అద్భుత చిత్రానికి టాగ్‌లైన్‌... 'ఎ ఫిల్మ్‌ ఫర్‌ యూత్‌'. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు 4 మార్లు పాదయాత్ర చేసి తన ప్రవచనాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆది శంకరుడు జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఇంత లేత వయస్సులోనే శంకరుడు అంచెలంచెలుగా జగద్గురువుగా ఎలా మారాడనే అంశమే ఈ చిత్ర కథనం. 'ఎంగస్టర్స్‌' తలచుకుంటే కానిది ఏదీ ఉండదనేది ఈ కథలో సందేశం. 'యూత్‌'కి ఓ కౌన్సిలింగ్‌ క్లాస్‌లా పర్సనాలిటీ డవలెప్‌మెంట్‌కి పనికి వచ్చేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం స్క్రీన్‌ప్లే నచ్చి... ఇప్పటకి ఐదుగురు హీరోలు... ఈ సినిమాలో నటించడానికి అంగీకరించడం విశేషం. ఒక అద్భుత పాత్ర కోసం జె.కె.భారవికి అత్యంత సన్నిహితుడైన మరో హీరోతో సంప్రదింపులు జరుగుతున్నట్టు భోగట్టా. ఆరుగురు హీరోలతో...ముగ్గురు హీరోయిన్లతో... అనేకమంది సీనియర్‌ నటీనటులతో, 'తారమేళా'లా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకాబోతున్న 'శ్రీ జగద్గురు ఆదిశంకర'. తెలుగు చలన చిత్ర చరిత్రలో రియల్‌మల్టీ స్టారర్‌గా నిలిచిపోతుంది. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు జె.కె.భారవి ప్రత్యేక దీక్షాధోరణి స్వీకరించబోతున్నట్టు తెల్సింది. త్వరలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Powered by web analytics software.