Free SMS And Earn Part Time Money







2/28/11

రజనీతో పోటి పడిన జూనియర్ యన్.టి.ఆర్


దక్షిణాది సినీరంగంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు ఎవరయ్యా అంటే..?రజనీకాంత్ ఒక్కడే..!అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే పోయిన సంవత్సరం ‘అదుర్స్’, ‘బృందావనం’ సినిమాలు పెద్ద హిట్ అవ్వటం, రజనీకాంత్ సినిమాలకు ధీటుగా జూ ఎన్టీఆర్ సినిమాలకు కలెక్షన్స్ రావడంతో, ఎన్టీఆర్ రజనీకాంత్ తో సమాన స్థాయిని పొందాడు. నటనలో కాదులెండి కేవలం రెమ్యునరేషన్ విషయంలో. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడు, తన తదుపరి చిత్రానికి 9కోట్లు తీసుకొని, వచ్చే నెలలో జరగబోయే షూటింగ్ లో పాల్గొంటున్నాడని, సినీ సర్కిల్స్ లో గుసగుసలు. తమిళ సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ కూడా తన రెమ్యునరేషన్ విషయంలో ఇలాంటి గ్రాఫ్ నే అవలంభించాడు. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోయే సినిమాకు ఎన్టీఆర్ కు 9కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ 9కోట్ల రెమ్యునరేషన్ లో బెంగళూరు హక్కులు కూడా ఉన్నాయి. తెలుగు స్టార్స్ కు బెంగుళూరులో మంచి మార్కెట్ ఉంది. జూ ఎన్టీఆర్ కు కూడా బెంగుళూరు మార్కెట్ కొన్ని కోట్లు ఉందని ఫిలింనగర్ న్యూస్. ‘ఎన్టీఆర్ ‘శక్తి’ఆడియో వేడుకను ఘనంగా జరుపుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సినిమాకు బెంగళూరు కు సంబందించి 7కోట్లకు పైగానే బిజినెస్ అయ్యింది. ఈ బిజినెస్ తో జూ ఎన్టీఆర్ కు తన రెమ్యునరేషన్ ను పెంచడానికి ఎంతో ఉపయోగపడింది. కావున సౌత్ ఇండియా హీరోలలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టాడు. ‘బృందావనం’అదుర్స్’కు వచ్చిన గ్రాస్ 30కోట్ల పైగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ‘శక్తి’ సినిమాకు నైజాం తరుపున 10కోట్ల బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. అందుకే జూ ఎన్టీఆర్ తదుపరి సినిమాకు 9కోట్లు అడగటం, ఇవ్వటం జరిగాయి.
Powered by web analytics software.