ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బాలయ్య ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని సిడ్నీ నుంచి నడుపుతున్నట్లు పోలీసులు కనుక్కున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయలేదు. నిర్వాహకులకు పోలీసులు నోటీసులు పంపించారు. సిడ్నీలోని తెలుగువారే ఈ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఫిర్యాదు వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తానో సినిమా ఆర్టిస్టునని, సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నానని, సమాజంలో తనకో హోదా ఉందని ఆయన చెప్పుకున్నారు. తాను సినీ పరిశ్రమలో 30 ఏళ్లుగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఓ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడినని ఆయన అన్నారు. ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు. తన పార్టీ క్యాడర్, అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను కోరారు.
2/28/11
i hate balayya కుపి లాగిన బాలయ్య

Powered by web analytics software. |